Rs.500 Gas Cylinder : ముందు సిలెండర్ కు 955 కట్టాల్సిందే…. తర్వాత ఖాతాల్లోకి సబ్సిడీ !

తెలంగాణలో మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. అయితే చాలా మంది ఐదు వందల రూపాయలు ఇస్తే… గ్యాస్ సిలెండర్ (Gas Cylinder) మార్చుకోవచ్చని అనుకుంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 28, 2024 | 10:50 AMLast Updated on: Feb 28, 2024 | 10:50 AM

955 Should Be Paid For The Front Cylinder Subsidy Into Later Accounts

తెలంగాణలో మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. అయితే చాలా మంది ఐదు వందల రూపాయలు ఇస్తే… గ్యాస్ సిలెండర్ (Gas Cylinder) మార్చుకోవచ్చని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు సిలెండర్ పూర్తి ధర 955 రూపాయలు చెల్లించాల్సిందే అంటున్నారు పౌరసరఫరాల అధికారులు. రూ.500 స్కీమ్ కి అర్హులైన వాళ్ళకు తర్వాత బ్యాంకుల్లో మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.

500కే గ్యాస్ సిలెండర్ పథకానికి అర్హులైన వారంతా ప్రస్తుతం సిలెండర్ అమౌంట్ మొత్తం చెల్లించాలి. అంటే మీ ఇంటికి వచ్చిన గ్యాస్ డెలివరీ బాయ్ కి రూ.955 చెల్లించాలి. అందులో 500లు పోగా మిగిలిని మొత్తాన్ని డైరెక్ట్ గా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ద్వారా కస్టమర్ల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ విధానం కొన్ని రోజుల పాటు అమల్లో ఉంటుందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత ఆర్థిక, పౌర సరఫరాల శాఖ (Department of Civil Supplies) ల సమన్వయంతో 500లు ఇచ్చి సిలెండర్ తీసుకునే విధానం అమలు చేస్తారు. రాష్ట్రప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు సబ్సిడీ మొత్తాన్ని అడ్వాన్సుడ్ గా చెల్లిస్తుంది. అవి డైరెక్ట్ గా ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్స్ లోకి పడిపోతాయి.

రాష్ట్రంలో 500 గ్యాస్ సిలెండర్ స్కీమ్ కి 40 లక్షల మందిని ఎంపిక చేశారు. తెల్ల రేషన్ కార్డు (White ration card) తో పాటు ఆధార్ కార్డు, వంట గ్యాస్ (Cooking gas) కనెక్షన్ ఉన్నవాళ్ళు తమ పేరు లేకపోతే వెంటనే తమ మండలంలోని తహసిల్దార్, MPDO ఆఫీసులకు వెళ్ళాలి. గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఆధార్, రేషన్ కార్డుల జిరాక్స్ కాపీలు ఇస్తే.. వాళ్ళ పేర్లు ఎంటర్ చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. రెగ్యులర్ గా గ్యాస్ సిలెండర్ బుక్ చేసుకొని వాడుతున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. మూడేళ్ళల్లో ఆ కుటుంబం సగటు వినియోగాన్ని లెక్కలోకి తీసుకొని… సబ్సిడీ సిలెండర్ (Subsidized cylinder) కోటా నిర్ణయిస్తారు.