బ్రేకింగ్: హైడ్రా బంద్…?
తెలంగాణాలో హైడ్రా దూకుడు ఆగిందా...? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. తెలంగాణా ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మున్సిపల్ డెవెలప్మెంట్ అధారటీ పరిధిలో ఉన్న అన్ని చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశాలు ఇచ్చింది.
తెలంగాణాలో హైడ్రా దూకుడు ఆగిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. తెలంగాణా ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మున్సిపల్ డెవెలప్మెంట్ అధారటీ పరిధిలో ఉన్న అన్ని చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశాలు ఇచ్చింది. గ్రేటర్ లోని చెరువుల విస్తీర్ణం, FTL బఫర్ జోన్ల ను గుర్తించాలని నిర్ణయం తీసుకుంది. మూడు నెలల్లో సర్వే పూర్తి చేయాలని ఇరిగేషన్, రెవిన్యూ శాఖలకు ఆదేశాలు ఇచ్చారు.
అప్పటి వరకు హైడ్రా కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది. చెరువుల ఎఫ్టీఎల్ ను నిర్దారించారా అని కోర్ట్ ఇటీవల ప్రశ్నించిన సంగతి తెలిసిందే. సర్వే పూర్తయ్యాక చెరువుల వివరాలను తెలంగాణా సర్కార్ వెబ్సైట్ లో పెట్టనుంది. అప్పటి వరకు కూల్చివేతలు ఆగే సూచనలు ఉన్నాయి. అయితే మూసి విషయంలో మాత్రం సర్కార్ ముందుకు అడుగులు వేయనుంది.