Amrapali : ఆమ్రపాలికి మరో రెండు బాధ్యతలు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం…
ఆమ్రపాలి (Amrapali) పేరు చుట్టూ జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిప్యూటేషన్ మీద ఢిల్లీకి వెళ్లి ఆమ్రపాలి..
ఆమ్రపాలి (Amrapali) పేరు చుట్టూ జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిప్యూటేషన్ మీద ఢిల్లీకి వెళ్లి ఆమ్రపాలి.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగి.. సీఎంగా రేవంత్ (CM Revanth Reddy) బాధ్యతలు తీసుకున్న తర్వాత.. మళ్లీ హైదరాబాద్‌లో కనిపించారు. దీంతో ఆమ్రపాలి, స్మితా సబర్వాల్ (Smita Sabharwal) పేర్లతో భారీ చర్చే జరిగింది. ఆమ్రపాలి ఇన్.. స్మితా ఔట్ అంటూ.. మాములు డిస్కషన్ నడవలేదు సోషల్ మీడియాలో. కట్ చేస్తే.. ఇద్దరు తెలంగాణ కేడర్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్మితా సంగతి ఎలా ఉన్నా.. డ్యాషింగ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా పేరున్న ఆమ్రపాలి ప్రస్తుతం హైదరాబాద్ (Hyderabad) మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్‌గా ఉన్నారు. 2010 తెలంగాణ కేడర్‌కు చెందిన ఈమె..
ఇటీవల కేంద్రం నుంచి తిరిగి వచ్చారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఆమెకు సముచిత స్థానం కల్పించింది. ఇప్పుడు మరో కీలక బాధ్యతలను ఆమ్రపాలికి అప్పగించింది రేవంత్ సర్కార్. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా.. ఐటీ అండ్ ఎస్టేట్‌తో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ఎండీగా అమ్రపాలి ఉన్నారు. ఐతే ఇప్పుడు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ నాలుగు పోస్టులు నిర్వహించడానికి… అన్ని కార్యాలయాలు ఒకే చోటుకు తరలిస్తున్నారు.
గతంలో ఆమ్రపాలి కేంద్రంలో విధులు నిర్వహించారు. డిప్యుటేషన్‌పై పీఎంవోలో కీలక బాధ్యతల్ని నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా ఐఏఎస్‌లలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఆమ్రపాలి. విశాఖలో విద్యాభ్యాసం తర్వాత 2010 యూపీఎస్సీ సివిల్స్‌లో సత్తాచాటి.. 39వ ర్యాంక్ సాధించారు. ఆ తర్వాత ట్రైనీ ఐఏఎస్‌గా, జాయింట్ కలెక్టర్‌గా, నగర కమిషనర్‌గా పనిచేశారు. 2018లో వరంగల్ జిల్లా అర్బన్, రూరల్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఆమె డిప్యుటేషన్‌పై పీఎంవోలో కీలక బాధ్యతల్ని నిర్వహించారు.