23 MMTC Trains Cancelled : హైదరాబాద్ నగర వాసులకు బ్యాడ్ న్యూస్.. 23 MMTC రైళ్లు రద్దు..
హైదరాబాద్ (Hyderabad) నగర వాసులకు ఎంఎంటీఎస్ (MMTC) బ్యాడ్ న్యూస్ చెప్పింది. నగరంలో 23 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల కారణంగా ఎంఎంటీఎస్ సర్వీసులతో పాటు పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

Bad news for residents of Hyderabad city.. 23 MMTS trains cancelled..
హైదరాబాద్ (Hyderabad) నగర వాసులకు ఎంఎంటీఎస్ (MMTC) బ్యాడ్ న్యూస్ చెప్పింది. నగరంలో 23 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల కారణంగా ఎంఎంటీఎస్ సర్వీసులతో పాటు పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. మౌలాలి-సనత్ నగర్ (Maulali-Sanat Nagar) మధ్య నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. నేటి 4వ తేదీ (ఆదివారం) నుంచి ఈ నెల 11వ తేదీ వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు మొత్తం 51 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. టైమ్ టేబుల్ ప్రకారం ఈ రైళ్లను రద్దు చేసినట్లు వివరించారు. ఈ నెల 9 వరకు మూడు ఎంఎంటీఎస్ రైళ్లు, 10 వరకు మరో రెండు, ఈ నెల 11 వరకు 18 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేసినట్లు వారు పేర్కొన్నారు. వీటితోపాటు మౌలాలి-అమ్ముగూడ-సనత్‌నగర్ మార్గంలో నడిచే హైదరాబాద్-సిర్పూర్-కాగజ్‌నగర్, వికారాబాద్-గుంటూరు, రాయపల్లె-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను షెడ్యూల్ ప్రకారం నిలిపివేస్తారు.