BANDLA GANESH: ఎమ్మెల్సీ రేసులో బండ్ల గణేష్.. కళాకారుల కోటాలో పదవి
సినిమా నటునిగా, నిర్మాతగానే కాక కాంగ్రెస్ సీజనల్ పొలిటిషన్‌గా బండ్ల గణేష్‌కు చాలా పేరుంది. ప్రతిసారి ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ వాదిగా హల్చల్ చేస్తూ ఉంటారు.
BANDLA GANESH: నటుడు, నిర్మాత, ప్రముఖ కోడిగుడ్ల వ్యాపారి బండ్ల గణేష్‌కు త్వరలో ఎమ్మెల్సీ వరించబోతోందా..? గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రేసులో బండ్ల గణేష్ ఉన్నట్లు బాగా ప్రచారం జరుగుతుంది. గవర్నర్ కోటాలో ఇచ్చే రెండు ఎమ్మెల్సీలు చాలా రోజులుగా ఖాళీగా ఉన్నాయి. కళలు, సాహిత్యం, సైన్స్, సంఘ సంస్కరణ ఇలా ఐదు రంగాల్లో విశిష్ట సేవ చేసిన వాళ్ళకి ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవి ఇస్తారు. కళాకారులు, రచయితలు, సంఘసంస్కర్తలు, మేధావులని గవర్నర్ కోటాలో ప్రభుత్వం ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తుంది.
TDP Vs YSRCP: రివర్స్ గేమ్ మొదలుపెట్టిన టీడీపీ.. జగన్‌కు చుక్కలు కనిపించడం ఖాయమా..?
అయితే గతంలో కెసిఆర్ సర్కార్ పొలిటికల్ లీడర్స్‌ని ఈ కోటాలో ఎమ్మెల్సీలుగా చేయడానికి ప్రయత్నించి భంగపడింది. నాలుగు నెలల క్రితం దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ఇద్దరినీ బిఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గవర్నర్ కి ప్రతిపాదనలు పంపింది. అయితే గవర్నర్ తమిళ సై ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. నిబంధనల ప్రకారం దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ ఇద్దరూ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు కాడానికి అర్హత లేదని, వాళ్లు కళాకారులు కాదని, పూర్తిస్థాయి రాజకీయవేత్తలని అందువల్ల వాళ్ళని, ఆమోదించలేమని గవర్నర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అప్పటినుంచి ఆ రెండు సీట్లు ఖాళీగానే ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వాటిని భర్తీ చేసే ఆలోచనలో ఉంది. సినిమా నటునిగా, నిర్మాతగానే కాక కాంగ్రెస్ సీజనల్ పొలిటిషన్‌గా బండ్ల గణేష్‌కు చాలా పేరుంది. ప్రతిసారి ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ వాదిగా హల్చల్ చేస్తూ ఉంటారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లేడుతో పీక కోసుకుంటానని సంచలనం సృష్టించారు బండ్ల గణేష్. ఇప్పుడు కూడా ఎన్నికల ముందు అదే హడావిడి చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందని.. ప్రమాణ స్వీకారానికి రెండు రోజులు ముందే ఎల్బి స్టేడియంలో వెళ్లి కూర్చుంటానని ప్రకటన చేసి మరోసారి సంచలనం సృష్టించారు. అడపాదడపా టిఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ పోస్టులు కూడా పెడుతుంటారు బండ్ల. గణేష్‌కు సన్నిహితులైన కొందరు కాంగ్రెస్ నాయకులు ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ప్రస్తావన కూడా తెచ్చారు. కళాకారుల కోటలో బండ్ల గణేష్ కు ఎమ్మెల్సీ ఇవ్వొచ్చని సూచించారు. మొదట గణేష్ కు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వొచ్చని బలంగా వినిపించింది. అయితే ఆయనే దాన్ని తిరస్కరించారని తెలిసింది. బండ్ల గణేష్ తరఫున కాంగ్రెస్‌లో ఒక బలమైన వర్గం గట్టిగా ప్రయత్నిస్తోంది.
ఇండస్ట్రీ తరఫునుంచి గణేష్ ఎమ్మెల్సీగా ఉంటే భవిష్యత్తులో పార్టీకి ప్రభుత్వానికి చాలా లాభాలు ఉంటాయని ఈ వర్గం చెప్తోంది. కానీ మరోవైపు ఇంకొక వర్గం ప్రొఫెసర్ కోదండరాం,కవి విమర్శకుడు అందెశ్రీకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడం సబబు అని వాదిస్తోంది. ఈ విధంగా ఇద్దరు బలమైన తెలంగాణ బాదులకు సముచిత స్థానం కల్పించినట్లు అవుతుందని ఈ వర్గం చెప్తోంది. తరచూ వివాదాల్లో ఉండే బండ్ల గణేష్ సంఘసంస్కర్తలు,సాహితీవేత్తల క్యాటగిరిలోకి ఎలా వస్తారనేది ఈ వర్గం వాదన. అంతేకాక గణేష్ బి ఆర్ ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వీటన్నిటిని అధిగమించి బండ్ల గణేష్ కళాకారుల కోటాలో ఎమ్మెల్సీ అవతాడా లేదా అనేది వేచి చూడాలి.