కాంగ్రెస్ రుణమాఫీ వైఫల్యం తో మళ్లీ లేచిన బి ఆర్ ఎస్
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ చేసుకున్న గందరగోళం తెలంగాణలో బి ఆర్ఎస్ కి మళ్లీ ఊపిరి పోసింది. లేనిపోని, చేయలేని వాగ్దానాలు ఇచ్చి, సవాళ్లు చేసి, ప్రమాణాలు చేసి చివరికి రుణమాఫీ వ్యవహారాన్ని కంపు కంపు చేసుకుంది రేవంత్ సర్కార్.
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ చేసుకున్న గందరగోళం తెలంగాణలో బి ఆర్ఎస్ కి మళ్లీ ఊపిరి పోసింది. లేనిపోని, చేయలేని వాగ్దానాలు ఇచ్చి, సవాళ్లు చేసి, ప్రమాణాలు చేసి చివరికి రుణమాఫీ వ్యవహారాన్ని కంపు కంపు చేసుకుంది రేవంత్ సర్కార్.31 వేల కోట్లు రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి చివరికి సగం చేసి ,సగం చేయలేక… అనవసరంగా ఆ వ్యవహారాన్ని నెత్తికెత్తుకుని చివరికి అల్లరి పాలైంది.
తెలంగాణలో తిరిగి పుంజుకోవడం ఎలాగని ఆలోచిస్తున్న బీఆర్‌ఎస్‌కు… వెదకబోయిన తీగ కాలికే తగిలింది. కాంగ్రెస్ సర్కారే రుణమాఫీ అస్త్రానికి పదునుపెట్టి మరీ బి ఆర్ ఎస్ చేతికి ఇచ్చింది ఇప్పుడు బీఆర్‌ఎస్ ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టే ప్లాన్‌లో ఉంది. తెలంగాణలో… పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని డిసైడ్ అయ్యింది. బీఆర్‌ఎస్. పార్టీ మళ్లీ బతికి బట్ట కట్టాలంటే ఏం చేయాలా అని తెగ ఆలోచిస్తున్న టైంలో వెదకబోయిన తీగ కాలికి తగిలిందని పార్టీ పెద్దలు సంబరపడిపోతున్నారు. రైతు రుణమాఫీ మా గులాబీ పార్టీకి ఆశాజ్యోతిలా కనిపిస్తోందని అంటున్నారు. అందేటీ… రుణమాఫీ చేసింది కాంగ్రెస్ సర్కార్ కదా…. అది బీఆర్‌ఎస్‌కు ఎలా ఊతం అవుతుందన్న డౌట్ రావచ్చు కానీ అసలు కిటుకు అక్కడే ఉందంటున్నాయి తెలంగాణ భవన్ వర్గాలు. రాష్ట్ర సాధన సమయంలో బీఆర్ఎస్ ఏ మీటింగ్ పెట్టినా… లక్ష్యం ఒక్కటే ఉండేది. జనం కూడా కన్విన్స్ అయ్యేవాళ్ళు. కానీ…పదేళ్ళ అధికారం తర్వాత పార్టీ తీరు మారిపోయిందన్న వాదన ఉంది పొలిటికల్ సర్కిల్స్‌లో. అందుకే మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న టైంలో రుణమాఫీ అంశం దొరికింది. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా రెండు లక్షల రూపాయల లోపు రైతు రుణాల్ని మాఫీ చేసింది కాంగ్రెస్ సర్కార్. అయితే…ఆ ఫలం అర్హులైన రైతులు అందరికీ అందలేదన్నది బీఆర్‌ఎస్ పాయింట్. ఇప్పుడు ఇదే అంశాన్ని పట్టుకుని జనంలోకి వెళ్ళే ప్రయత్నంలో ఉంది ప్రతిపక్ష పార్టీ. గ్రామాల వారీగా… అర్హత ఉండి, మాఫీ జరగని రైతుల వివరాలు సేకరించి ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్లాన్ చేస్తోంది.
ముందు చెప్పినట్టుగా అర్హత ఉన్న ప్రతి రైతుకూ రుణమాఫీ జరిగేలా వత్తిడి తీసుకువస్తే పోగొట్టుకున్న చోటే తిరిగి పుంజుకోవచ్చన్నది brs పార్టీ ప్లాన్‌గా తెలిసింది. గత ఎన్నికల్లో గ్రామీణ తెలంగాణలో దారుణంగా దెబ్బతింది కారు పార్టీ. సహజంగానే ఇక్కడ రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి రుణమాఫీ ఉద్యమం ద్వారా వాళ్ళని తిరిగి తమవైపునకు మళ్ళించుకోవాలన్నది బీఆర్‌ఎస్ అధిష్టానం ప్లాన్‌గా తెలిసింది. దాని ద్వారా…. ఇచ్చిన హామీని కాంగ్రెస్ సర్కార్ నిలబెట్టుకోలేకపోతే… రైతుల తరపున తామే పోరాడి ఇప్పించామన్న క్రెడిట్ తెచ్చుకోవాలన్న ప్లాన్ ఉందట. అందుకే గ్రామాల వారీగా రుణమాఫీ అవ్వని రైతుల డేటాను పార్టీ తరపున సేకరించే పని ముమ్మరంగా జరుగుతోంది. తర్వాత మాఫీ అవ్వని రైతులందర్నీ ఏకం చేసేపని మొదలుపెడుతోంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు తాము జనాల్లోకి వెళ్ళడానికి ఒక అంశం దొరికింది. అదే సమయంలో దూరమైన గ్రామీణ ఓటర్లను త్వరగా చేరుకోవడానికి లైన్ క్లియర్ అయిందన్న చర్చ జరుగుతోంది గులాబీ పార్టీలో. రుణమాఫీ అవ్వని రైతుల తరపున పోరాటం చేస్తే.. వాళ్ళకు దగ్గర అవడంతో పాటు తమకు పొలిటికల్ గ్రౌండ్‌లో ప్లేస్ దొరుకుతుందన్నది బీఆర్‌ఎస్ స్కెచ్‌గా తెలుస్తోంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఇతర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించబోతోంది బి ఆర్ ఎస్.
అయితే… ఇదే సమయంలో పార్టీలోనే ఇంకో వాయిస్ వినిపిస్తోంది. రుణమాఫీ విషయంలో అప్పుడే తొందరపడటం ఎందుకు? కొన్నాళ్ళు ఆగితేనే మంచిదని అంటుంది. ఒకే ఊళ్ళో కొందరికి మాఫీ అయి మరి కొందరికి అవకుంటే… అటోమేటిగ్గా రైతుల్లోనే వ్యతిరేకత మొదలవుతుందని, అలాంటప్పుడు ఆ అగ్గికి ఆజ్యం పోస్తే తేలిగ్గా వర్కౌట్ అవుతుందిగానీ… ఇప్పటి నుంచే మనం ఇంతలా చించుకోవడం ఎందుకన్నది కొందరు సీనియర్స్ అభిప్రాయం. కానీ… బీఆర్‌ఎస్‌లోనే మరో వర్గం అభిప్రాయం మాత్రం దొరికిన ఛాన్స్‌ని వదులుకోవద్దన్నట్టుగా ఉంది .మొత్తంగా రైతు రుణమాఫీనైతే ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా… తాము తిరిగి పుంజుకునే ఆయుధంగా వాడుకోవాలన్నది బీఆర్‌ఎస్ ప్లాన్.