BRS leaders : కేసీఆర్ చెవిలో మళ్ళీ పూలు పెడుతున్న.. బీఆర్ఎస్ నాయకులు
కోట మీద ఆన.. ఈసారి కొట్టి తీరతాం అంటున్నారట ఆ నాయకులు. కొట్టేస్తాం.. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టేస్తామంటూ.. కారు పార్టీ అధిష్టానానికి కొత్త లెక్కలు చెబుతున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్‌ఎస్.. లోక్‌సభ ఎలక్షన్స్‌లోనైనా సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో అత్యంత జాగ్రత్తగా కసరత్తు జరుగుతోందంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ క్రమంలోనే.. ఈసారి భువనగిరి టిక్కెట్ ఆశిస్తున్న నేతలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలిసింది.
కోట మీద ఆన.. ఈసారి కొట్టి తీరతాం అంటున్నారట ఆ నాయకులు. కొట్టేస్తాం.. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టేస్తామంటూ.. కారు పార్టీ అధిష్టానానికి కొత్త లెక్కలు చెబుతున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్‌ఎస్.. లోక్‌సభ ఎలక్షన్స్‌లోనైనా సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో అత్యంత జాగ్రత్తగా కసరత్తు జరుగుతోందంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ క్రమంలోనే.. ఈసారి భువనగిరి టిక్కెట్ ఆశిస్తున్న నేతలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ కంచుకోటలో పాగా వేయాలని అగ్రనాయకత్వం పట్టుదలగా ఉందన్న వార్తలతో ఆశావహులు కూడా తమ వ్యూహాలకు పదును పెడుతున్నారట. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఉద్యమ నాయకులు ఈసారి బీఆర్‌ఎస్ రేస్‌లో ముందున్నట్టు తెలిసింది.
వరుసగా రెండు సార్లు భువనగిరి అసెంబ్లీ నుంచి గెలిచి.. మూడోసారి ఓడిపోయిన పైళ్ల శేఖర్ రెడ్డి ఈసారి పార్లమెంట్ మెట్లు ఎక్కాలని ఉవ్విళ్ళూరుతున్నారట. ఆ మేరకు ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు ప్రపోజల్ పెట్టేశారట ఆయన. క్యాడర్ నుంచి కూడా వత్తిడి ఉండటంతో… లోక్‌సభకు పోటీ చేస్తే ఎలా ఉంటుంది? జయాపజయాల సంగతేంటి? ఎంత ఖర్చుఅవుతుంది? అంటూ.. వివిధ వర్గాల ద్వారా సమాచారం సేకరిస్తున్నారట పైళ్ళ. మరో మాజీ ఎమ్మెల్యే భూడిద భిక్షమయ్య గౌడ్ కూడా తనకు ఎంపీ సీటు కావాలంటూ పావులు కదుపుతున్నారట. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున ఆలేరు ఎమ్మెల్యేగా గెలిచిన భిక్షమయ్య.. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో కొన్నాళ్ళకు బీఆర్ఎస్ గూటికి చేరారు. పార్టీ మారుతున్న టైంలోనే.. తనకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే.. అది సాధ్యం కాలేదు కాబట్టి.. తనకు ఈసారి ఎంపీగా అవకాశం ఇవ్వాలని గట్టిగానే పట్టుబడుతున్నట్టు తెలిసింది. కాంగ్రెస్, బీజేపీ నేతలతో కూడా సత్సంబంధాలు, నియోజకవర్గం పరిధిలో తన సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉండటం లాంటివి తనకు ప్లస్ అవుతాయని లెక్కలు చెబుతున్నారట భిక్షమయ్యగౌడ్.
ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి కారెక్కిన ఉద్యమ నేత చెరుకు సుధాకర్ కూడా తనకో అవకాశం ఇవ్వాలని కేసీఆర్‌ను కోరుతున్నారట. తెలంగాణ ఉద్యమ నేపధ్యం, తన అనుభవాన్ని చూడాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్‌లో చేరిన మరో ఉద్యమ నాయకుడు జిట్టా బాలక్రిష్ణారెడ్డి కూడా ఎంపీ సీటు కోసం ఎదురుచూస్తున్నారట. అన్ని పార్టీలలో ఉన్న ఉద్యమకారులతో సన్నిహిత సంబంధాలను ఆయన తన బలంగా చూపుతున్నట్టు తెలిసింది. అభ్యర్థుల ఎంపిక కసరత్తు కొలిక్కి వచ్చే సమయానికి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయోగానీ.. నాయకులంతా ఎవరికి వారు తమ ప్లస్‌ల గురించి చెబుతూ… అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టారు.