BRSతో BSP పొత్తు ఖరారు.. 3 ఎంపీ సీట్లు ఇవ్వాలని RS ప్రవీణ్ డిమాండ్..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాసేపటి క్రితమే బంజారాహిల్స్‌లోని నందినగర్ లోని కేసీఆర్ నివాసం మర్యాదపూర్వకంగా కలిశారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ స‌మావేశంలో హ‌రీశ్‌రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, బాల్క సుమాన్‌తో పాటు ప‌లువురు ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 5, 2024 | 04:13 PMLast Updated on: Mar 05, 2024 | 4:55 PM

Bsp Alliance With Brs Rs Praveen Demands To Give 3 Mp Seats

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాసేపటి క్రితమే బంజారాహిల్స్‌లోని నందినగర్ లోని కేసీఆర్ నివాసం మర్యాదపూర్వకంగా కలిశారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ స‌మావేశంలో హ‌రీశ్‌రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, బాల్క సుమాన్‌తో పాటు ప‌లువురు ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

దేశంలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పోటీ చేస్తాయని రాజకీయ వర్గాలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఆ దిశగానే ప్రయత్నాలు కూడా మొదలైందని ఈ భేటీతో స్పష్టమైంది. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో బీఎస్పీ రాష్ట్రా అధ్యక్షుడు పార్టీ మారుతున్నారంటూ.. బీఆర్ఎస్ లో చేరి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.దీనిపై స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విటర్ వేదికగా స్పందించారు. “నా రాజకీయ ప్రస్థానం పై వస్తున్న ఎలాంటి వదంతులను నమ్మకండి. చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం, స్వేఛ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం దిశ వైపే నా ప్రయాణం.” అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్ తో ఆర్ఎస్ ప్రవీణ్ పార్టీ మారడం లేదని స్పష్టమైంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు ఖరారు అయ్యాయి.

ఇదే విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు ఉంచగా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓ ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం.. నాగర్ కర్నూల్ తో పాటు మరో రెండు ఎంపీ సీట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ ముందు ప్రతిపాదన ఉంచినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.. దీంతో కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తానని చేప్పారు. కేసీఆర్ మాత్రం నాగర్ కర్నూల్ ఎంపీ సీటును BSPకి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.. కానీ బీఎస్పీ 3 సీట్లు ఇవ్వాలని డిమాండ్ తో కేసీఆర్ సందిగ్ధంలో పడ్డారు.

కాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తరఫున నాగర్ కర్నూల్ ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నిన్న 4 ఎంపీ సీట్లు ప్రకటించింది. రాబోయే రోజుల్లో ఈ చర్చలు ఎటువైపు దారితీస్తాయో వేచి చూడాలి.

మరోవైపు కేంద్రంలోని రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ అధినేత్రి మాయావతి అటు ఇండియాలో.. ఇటు ఎన్డీఏ కూటమిలో చేరలేదు. ఎట్టకేలకు రాష్ట్రాంలో బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీలు పొత్తు పెట్టుకోనకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. దీంతో దేశ రాజకీయాల్లో కూడా బీఆర్ఎస్.. బీఎస్పీ పార్టీలు కలిసి వెళ్లేందుకు యోచిస్తున్నట్లు సమాచారం.

SURESH. SSM