MALLAREDDY : అయితే కాంగ్రెస్… లేకుంటే బీజేపీ.. మల్లారెడ్డికి రెండు వైపులా మోత

బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) పరిస్థితి ఇప్పుడు మింగ లేక... కక్కలేక అన్నట్టుగా ఉంది. అయితే కాంగ్రెస్... లేకుంటే బీజేపీ... ఎక్కడికైనా మారాల్సిందే. బీఆర్ఎస్ లోనే ఉంటే... ఈ ఐదేళ్ళల్లో తన వ్యాపార సామ్రాజ్యం కూలిపోవడం ఖాయం అని భయపడుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 19, 2024 | 10:17 AMLast Updated on: Mar 19, 2024 | 10:17 AM

But Congress Otherwise Bjp Mallareddy Has Two Sides

 

బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) పరిస్థితి ఇప్పుడు మింగ లేక… కక్కలేక అన్నట్టుగా ఉంది. అయితే కాంగ్రెస్… లేకుంటే బీజేపీ… ఎక్కడికైనా మారాల్సిందే. బీఆర్ఎస్ లోనే ఉంటే… ఈ ఐదేళ్ళల్లో తన వ్యాపార సామ్రాజ్యం కూలిపోవడం ఖాయం అని భయపడుతున్నారు. వ్యాపారాలకు ఇబ్బందుల్లేకుండా రాజకీయాలు (politics) చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకే నేను పార్ట్ టైం పొలిటీషియన్ ను … ఫుల్ టైమ్ బిజినెస్ మెన్ ను అని చెప్పుకుంటున్నారు మల్లారెడ్డి.

BRS ప్రభుత్వ హయాంలో… రేవంత్ రెడ్డిని తొడగొట్టి సవాల్ చేసిన మల్లారెడ్డి… కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనీ… ఆ రేవంత్ రెడ్డే సీఎం అవుతారని… అస్సలు ఊహించలేదు. కాలేజీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లలో అక్రమాలను కాంగ్రెస్ సర్కార్ వెలికితీస్తుండటం… ప్రభుత్వ భూములు, చెరువు శిఖంలో అక్రమంగా ఆక్రమించి కట్టిన భవనాలను ఒక్కోటి కూలగొడుతుండటంతో… కాళ్ళ కింద భూమి కదిలినట్టుగా ఉంది మల్లారెడ్డికి. అందుకే కాంగ్రెస్ లో జాయిన్ అయితే తన అక్రమాలకు రక్షణ ఉంటుందని డిసైడ్ అయ్యారు. కానీ రేవంత్ కాలు పెట్టనీయడం లేదు. ఇక్కడ కాదులే అనుకొని… డీకే శివకుమార్ ఇతర AICC పెద్దల్ని పట్టుకొని హస్తం పార్టీలో దూరిపోవాలనుకున్నారు. కానీ మల్లారెడ్డి విషయంలో ఇక్కడ స్విచ్చ్ వేస్తేనే… అక్కడ బల్బు వెలిగే పరిస్థితి. మల్కాజ్ గిరి స్థానంలో తన కొడుకుని బీఆర్ఎస్ తరపున నిలబెట్టాలి అనుకున్నా… కాంగ్రెస్ కి భయపడి వెనక్కి పీక్కున్నారు.

ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం భయానికి తోడు అటు కేంద్రంలో బీజేపీ నుంచీ మల్లారెడ్డికి ఇబ్బందులు తప్పట్లేదు. ఆయన ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో ఇన్ కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతున్నాయి. మేనేజ్ మెంట్ కోటా సీట్లను డబుల్, ట్రిపుల్ రేట్లకు అమ్ముతూ అక్రమంగా సంపాదిస్తున్నట్టు మల్లారెడ్డి కాలేజీలపై ఆరోపణలున్నాయి. తన బంధువుల పేర్లతో బినామా వ్యవహారాలు కూడా నడుపుతున్నట్టు ఐటీ అధికారులకు ఫిర్యాదులు వెళ్ళాయి. దాంతో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ మధ్య మల్లారెడ్డి నలిగిపోతున్నారు మల్లారెడ్డి. తనకు పాలిటిక్స్ కంటే బిజినెస్ ముఖ్యమని నమ్ముతున్నారు. అందుకే… అయితే కాంగ్రెస్… లేదంటే బీజేపీ ఎటైనా సరే… బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోవాలని మాత్రం డిసైడ్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లీడర్లతో ఇదే విషయం కుండబద్దలు కొట్టేశారు మల్లారెడ్డి. రేవంత్ రెడ్డి కనికరం కోసం ఎదురు చూస్తున్నారు.