Weather update : హైదరాబాద్ ను కమ్మేసిన మబ్బులు.. నగర శివారులో వర్షం..
హైదరాబాద్ (Hyderabad) ను కమ్మేసిన కారుమబ్బులు హైదరాబాద్లో వాతావరణం (Weather) మారిపోయింది.

Clouds engulfed Hyderabad.. Rain in the suburbs of the city..
హైదరాబాద్ (Hyderabad) ను కమ్మేసిన కారుమబ్బులు హైదరాబాద్లో వాతావరణం (Weather) మారిపోయింది. ఉదయం నుంచి ఎండ కాయగా.. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులు మధ్యాహ్నానికి నగరాన్ని మబ్బులు కమ్మేశాయి. చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. హైదరాబాద్లో పలుచోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. కూకట్ పల్లి, నిజాంపేట్, హైదర్ నగర్, బాచుపల్లిలో వర్షం పడుతోంది. రాగల ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంచిర్యాల, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.