CM CARS : కేసీఆర్ ఆర్డరిచ్చిన కార్లు… ఇప్పట్లే రానట్టే !

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆర్డర్ ఇచ్చిన 22 ల్యాండ్ క్రూయిజర్ కార్లల్లో 3 కార్లు మాత్రమే ఇప్పటి వరకూ CMOకి డెలివరీ అయ్యాయి.  మిగతా వాటి పనులు నత్తనడకన సాగుతున్నాయి.  త్రిహాయని ఇంజినీరింగ్ సంస్థ ఆర్థికంగా ఇబ్బదులు పడుతోంది.  డబ్బులు లేకపోవడంతో ... ఇంకా 9 కార్ల పనులు అసలు మొదలు పెట్టలేదు.  సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత అవి డెలివరీ అవుతాయా... లేదా అన్నది అనుమానంగా మారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 31, 2023 | 11:45 AMLast Updated on: Dec 31, 2023 | 11:45 AM

Cm 22 Land Cruiser Cars Not Delivered

మూడోసారి కూడా ముఖ్యమంత్రి అవుతాననే ఉద్దేశ్యంతో మాజీ సీఎం కేసీఆర్… 22  కొత్త ల్యాండ్ క్రూయిజర్ కార్లకు గత ఏప్రిల్ లోనే ఆర్డరిచ్చారు.  ఈ కార్లకు ఏపీ విజయవాడలోని త్రిహాయని ఇంజినీరింగ్ కంపెనీలో బుల్లెట్ ప్రూఫ్, శాటిలైట్ లింకేజ్ పనులు సాగుతున్నాయి.  వీటిల్లో ఇప్పటికే 3 కార్లను హైదరాబాద్ కు పంపింది సంస్థ.  ఇంకో కారు టెస్టింగ్ కోసం కేరళ వెళ్ళింది. మిగతా 18 కార్లలో తొమ్మిదికి సంబంధించిన పనులు జరుగుతుండగా… మరో 9 కార్లను ఇంకా ఓపెన్ చేయలేదు.  ప్రస్తుతం పనులు జరుగుతున్న కార్ల బానెట్లు పీకి పక్కనపెట్టారు… కార్ల స్ట్రక్చర్ మాత్రమే కనిపిస్తోంది.

సీఎం కాన్వాయ్ కార్లు తయారు చేయడంలో ఆలస్యం ఎందుకు జరుగుతోంది అంటే… గతంలో త్రిహాయని, మిత్ర కంపెనీ, జపాన్ కు చెందిన క్యూకుటో కంపెనీతో కలసి పనిచేసేవి.  జపాన్ కంపెనీ ఈ అగ్రిమెంట్ నుంచి తప్పుకుంది. దాంతో మిత్ర కంపెనీ ఇబ్బందుల్లో పడింది.  బ్యాంకుకు లోన్ రీపెమెంట్ లేకపోవడంతో మిత్ర కంపెనీని సీజ్ చేశారు. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా సెక్యూరిటీలో సంస్థ నడుస్తోంది.  ఆర్థిక ఇబ్బందుల వల్లే బుల్లెట్ ప్రూఫ్, ఇతర టెక్నాలజీని కార్లల్లో అమర్చడానికి లేట్ అవుతోంది.  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత ఈ కార్ల బుల్లెట్ ప్రూఫింగ్ పనులు కొంచెం స్పీడ్ అందుకున్నాయి.  కానీ 18 కార్లు ఇప్పట్లో డెలివరీ అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు.

BRS leaders : కేసీఆర్ చెవిలో మళ్ళీ పూలు పెడుతున్న.. బీఆర్ఎస్ నాయకులు

కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా 18 ఫార్చ్యునర్ కార్లకు మిత్ర సంస్థకే బుల్లెట్ ప్రూఫ్ పనులు అప్పగించారు.  అంతకుముందు ఏపీ సీఎం జగన్ కూడా తన 10 కార్లకు త్రిహాయని సంస్థలోనే బుల్లెట్ ప్రూఫింగ్ చేయించారు. అప్పటికి అసలు ఈ సంస్థకు అనుమతులే లేవు.  కేసీఆర్ ఆర్డర్ ఇచ్చిన ల్యాండ్ క్రూయిజర్ల తర్వాతే త్రిహాయని సంస్థ పర్మిషన్ తెచ్చుకుంది. కేసీఆర్, జగన్ కార్లకు బుల్లెట్ ప్రూఫింగ్ చేసిన త్రిహాయని సంస్థ… జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు మాత్రం నో చెప్పింది.  తన రెండు కార్లకు బుల్లెట్ ప్రూఫింగ్ చేయాలని పవన్ అడిగితే… తమకు అనుమతులు లేవని చెబుతోంది.  మరి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి  కాన్వాయ్ ల్లోని కార్లకు పర్మిషన్ లేకుండానే త్రిహాయని సంస్థ ఎలా బుల్లెట్ ప్రూఫింగ్ చేయించిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.