Lok Sabha Elections : నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారం చాలా జోరు మిదా నడుస్తున్న సంగతి తెలిసిందే.. కాగా నేడు తెలంగాణ కాంగెస్ పీసీసీ చీఫ్ (Congress PCC chief)..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 22, 2024 | 10:16 AMLast Updated on: Apr 22, 2024 | 10:16 AM

Cm Revanth Reddys Visit To Three Constituencies Today

 

 

 

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారం చాలా జోరు మిదా నడుస్తున్న సంగతి తెలిసిందే.. కాగా నేడు తెలంగాణ కాంగెస్ పీసీసీ చీఫ్ (Congress PCC chief).. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎన్నికల ప్రచారంలో స్పీడ్ అందుకున్నారు.

లోక్ స‌భ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌చారంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌చారంలో స్పీడ్ పెంచారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేసే కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. కాగా నేటికి అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయకుండా పెండింగ్ ఉంచిన ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ మినహా మిగిలిన 14 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమం కొనసాగుతోంది.

ఇందులో భాగంగా అభ్య‌ర్థుల గెలుపు కోసం ప్ర‌చారంతో పాటు నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో కూడా పాల్గొంటున్నారు. కాగా, ఇవాళ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయా అభ్య‌ర్థులకు మ‌ద్ధ‌తుగా ప్ర‌చారం చేయ‌నున్నారు. ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్.. మధ్యాహ్నం ఒంటి గంటలకు నిజామాబాద్.. సాయంత్రం 4 గంటలకు.. మల్కాజ్‌గిరి లోక్ సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఆత్రం సుగుణ, జీవన్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ల కార్యక్రమాలకు రేవంత్ హాజరు కానున్నారు. భారీ ర్యాలీతో తరలి వెళ్లి ఈ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు.

రేపు నాగర్ కర్నూల్ పర్యటన ఉండే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నెల 24 వరంగల్, 25న చేవెళ్ల అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు.

SSM