CM Revanth Reddy : నేడు భువనగిరిలో సీఎం రేవంత్ పర్యటన..
రాబోయే పార్లమెంట్ (Parliament) ఎన్నికలకు తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ (Congress Party) తెలంగాణ వ్యాప్తంగా సూడిగాలి పర్యటనలు చేస్తు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.

CM Revanth's visit to Bhuvanagiri today..
రాబోయే పార్లమెంట్ (Parliament) ఎన్నికలకు తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ (Congress Party) తెలంగాణ వ్యాప్తంగా సూడిగాలి పర్యటనలు చేస్తు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. పార్టీ అభ్యర్థులను గెలుపించుకునేందుకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రంగంలోకి దిగారు. అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ, రోడ్‌షోలు, భారీ బహిరంగసభల్లో పాల్గొంటున్నారు. నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా భవనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.
నేడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు భువనగిరి పట్టణంలో పెద్దఎత్తున రోడ్‌షో నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి రానుండటంతో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు లక్షమందితో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రోడ్‌షో నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి భువనగిరిలోని అంబేడ్కర్ చౌరస్తాను పరిశీలించారు. రేపు మధ్యాహ్నం ఆదిలాబాద్, 23న నాగర్ కర్నూల్ బహిరంగ సభలో, 24న ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్లో సీఎం రేవంత్ పాల్గొంటారు.
SSM