Congress : ఈసారి సరికొత్త మైండ్‌గేమ్ ఆడబోతున్న కాంగ్రెస్
అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వ్యూహాన్నే.. లోక్‌సభకు (Lok Sabha) కూడా అప్లయ్ చేయాలని అనుకుంటుందట తెలంగాణ కాంగ్రెస్. నాడు.. బీఆర్‌ఎస్‌ని మైండ్ గేమ్‌తో ఇరుకునపెట్టింది. పార్టీలోకి వలసలను ప్రోత్సహించి.. ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసుకుంది. ఆ వ్యూహం బాగా వర్కౌట్ అయిందన్నది గాంధీభవన్ వర్గాల అభిప్రాయమట.

Congress is going to play a new mind game this time
అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వ్యూహాన్నే.. లోక్‌సభకు (Lok Sabha) కూడా అప్లయ్ చేయాలని అనుకుంటుందట తెలంగాణ కాంగ్రెస్. నాడు.. బీఆర్‌ఎస్‌ని మైండ్ గేమ్‌తో ఇరుకునపెట్టింది. పార్టీలోకి వలసలను ప్రోత్సహించి.. ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసుకుంది. ఆ వ్యూహం బాగా వర్కౌట్ అయిందన్నది గాంధీభవన్ వర్గాల అభిప్రాయమట. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు భారీగా పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అదే కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టిందన్న విశ్లేషణలు ఉన్నాయ్. దీంతో తాజాగా టార్గెట్ బీజేపీ అంటోందట టీకాంగ్రెస్. నాటి చేరికల వ్యూహానికి కొనసాగింపుగా.. ఇప్పుడు ఆపరేషన్ లోటస్‌ని మొదలుపెట్టి గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) పరిధిలో బీజేపీ (BJP) నుంచి చేరికలకు తెర లేపాలని ఫిక్స్ అయినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయ్.
ఇటీవల పార్లమెంటు వారీగా జరిగిన సమీక్ష సమావేశంలో కూడా చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. జీహెచ్‌ఎంసీలోని గోషామహల్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత విక్రం గౌడ్.. తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. తనకు సరైన ప్రాతినిధ్యం కల్పించడం లేదంటూ.. కొంతకాలంగా అసమ్మతితో ఉన్నారాయన. అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డారు విక్రమ్. దీంతో ఆయన కాషాయ దళం నుంచి బయటికి వచ్చి.. కాంగ్రెస్ గూటికి చేరడానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది. బీజేపీలో ఉన్న మరో నేత కూన శ్రీశైలంగౌడ్ కూడా.. తిరిగి సొంత గూటికి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అటు విక్రమ్.. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ రాజకీయ వారసుడు. ముఖేష్ గౌడ్.. కాంగ్రెస్ కుటుంబంలోని నాయకుడే. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాత కాంగ్రెస్ నాయకులందరినీ తిరిగి పార్టీలో చేర్చుకోవాలన్న ఆలోచన.. పార్టీ పెద్దలకు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
అందులో భాగంగానే.. విక్రమ్, శ్రీశైలంతో పాటు జయసుధ కూడా కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. కారణాలు ఏవైనా.. ఎన్నికల ముందు బీజేపీని టార్గెట్ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్‌లో బలం పెంచుకునే పనిలో పడింది కాంగ్రెస్. దీనిలో భాగంగానే వ్యూహాత్మకంగా చేరికలపై నజర్ పెట్టినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టిఆర్ఎస్ మాత్రమే పైచేయి సాధించింది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం పెద్దగా ఉండదనేది కాంగ్రెస్ అంచనా. జాతీయ రాజకీయాల చుట్టే పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయి కాబట్టి పోటీ తమకు, బీజేపీకి మధ్యనే ఉంటుందన్న అంచనాతో.. ఆపరేషన్ లోటస్ మొదలుపెట్టినట్టు అర్థం అవుతోందని రాజకీయ వర్గాలు