PONNAM PRABHAKAR: ఎమ్మెల్యే చిలిపి పని.. వివాదంలో మంత్రి పొన్నం..
వేడుకల్లో భాగంగా ఓ ఎమ్మెల్యే చేసిన చిలిపి పని.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఇరుకున పడేసింది. మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు సంబంధించిన ఓ వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
PONNAM PRABHAKAR: తెలంగాణ ఇచ్చిన పార్టీగా అధికారంలోకి రావడంలో వరుసగా రెండుసార్లు ఫెయిల్ అయిన కాంగ్రెస్.. ఎట్టకేలకు అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్ బాధ్యతలు స్వీకరించారు. మంత్రివర్గం కూడా అదుర్స్ అనిపించింది. రేవంత్ తన మార్క్ పాలనతో జనాలకు చేరువయ్యేలా దూసుకుపోతున్నారు. ఇక అటు కాంగ్రెస్ శ్రేణులు.. 2023ను చాలా సెంటిమెంట్‌గా ఫీల్ అవుతున్నాయ్. పార్టీ అధికారంలోకి రావడంతో.. లక్కీ ఇయర్ అని భావిస్తున్నారు. అందుకే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయ్. ఐతే ఇలాంటి వేడుకల్లో భాగంగా ఓ ఎమ్మెల్యే చేసిన చిలిపి పని.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఇరుకున పడేసింది.
Congress Government : తెలంగాణలో నామినేటెడ్ పోస్టులు.. వాళ్ళకి మాత్రమే అంటున్న రేవంత్
మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు సంబంధించిన ఓ వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో.. కేక్ కట్ చేసిన తర్వాత ఎమ్మెల్యే కవ్వంపల్లి.. ఓ మహిళ పట్ల వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదంగా మారింది. కొత్త ఏడాది వేడుకల్లో భాగంగా.. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి.. ఎమ్మెల్యే కవ్వంపల్లి కేక్ కట్టింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేక్ కట్టింగ్ తర్వాత పక్కనే ఉన్న ఓ మహిళకు కేక్ పూసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించారు. ఆ మహిళ ఇబ్బంది పడుతున్నా.. ఎమ్మెల్యే వెనక్కి తగ్గినట్లు కనిపించలేదు. ఐతే ఈ ఘటన జరుగుతున్నప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ పక్కనే ఉన్నారు. ఇక మరో వీడియోలో తాను డ్యాన్సు చేస్తూ.. ఆ మహిళను కూడా డ్యాన్స్ చేయాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి ఒత్తిడి చేయడం కనిపించింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయ్. ఎమ్మెల్యే తీరు పైనే కాదు.. మంత్రి పొన్నం మీద కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయ్. ఎమ్మెల్యే అలా వ్యవహరిస్తుంటే.. కంట్రోల్ చేయాల్సిన పనిలేదా అంటూ ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారడంతో ఎమ్మెల్యే కవ్వంపల్లితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్‌పైనా విమర్శలు వస్తున్నాయి. మహిళలు రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే రాణిస్తున్నారని.. ఇలాంటి చర్యలతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ పలువురు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఐతే మరికొందరు మాత్రం ఇది పాత వీడియో అని.. కావాలని ఇప్పుడు వైరల్ చేస్తున్నారంటూ కౌంటర్ ఇస్తున్నారు. వీడియో పాతదో, కొత్తదో.. కొత్త వివాదం మాత్రం సోషల్ మీడియాలో మొదలైంది.