Employees Salaries : 2024 న్యూఇయర్ గుడ్ న్యూస్… తెలంగాణలో ఫస్ట్ వీక్ లోనే జీతాలు !

కొత్త ఏడాది 2024లో రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. ఇక నుంచి జీతాలు, పెన్షన్ల డబ్బులు ప్రతి నెలా మొదటి వారంలోనే ఉద్యోగుల ఖాతాల్లో పడిపోతాయి. సీఎం రేవంత్ ఆదేశాలతో ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ అందుకు తగ్గినట్టుగా ఏర్పాట్లు చేస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 31, 2023 | 09:29 AMLast Updated on: Dec 31, 2023 | 9:29 AM

Employees Salaries In Every Month First Week

ప్రభుత్వ ఉద్యోగాలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి నెలా మొదటి వారంలోనే ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కొత్త ఏడాది 2024 జనవరి నుంచి ఈ విధానం అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గత ప్రభుత్వం లాగా ఉద్యోగాలను జీతాల కోసం వేధించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంప్లాయీస్ కి సంబంధించిన పెండింగ్ బిల్లులను కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు అందాయి. జనవరి 2024 నుంచి మొదటి వారంలోనే జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించాల్సి రావడంతో ముందుగానే నిధులను రెడీ చేసుకుంది ఆర్థిక శాఖ. ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వకపోతే ప్రభుత్వం పరువుపోతుందని ఇటీవల జరిగిన రివ్యూ మీటింగ్ లో రేవంత్ రెడ్డి అన్నారు. గత BRS సర్కార్ లో జీతాలు, పెన్షన్లు ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూడాల్సి వచ్చేది. మెడికల్ బిల్స్, లీవ్ ఎన్ క్యాష్ మెంట్, GPF లోన్ బిల్లులు కూడా క్లియర్ అవడానికి నెలల తరబడి సమయం పట్టేంది. ఒకటి రెండు సార్లు ఉన్నతాధికారులు అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళినా సరైన స్పందన లేకపోవడంతో వాళ్ళు కూడా చేసేది లేక ఊరుకుండి పోయారు.