BJP CHANDRASEKHAR: చంద్రశేఖర్ మ్యాజిక్‌తో.. బీజేపీ లీడర్లు సెట్ అవుతారా..?

రాజస్థాన్‌లో గ్రూప్ రాజకీయాలను దారిలో పెట్టిన చంద్రశేఖర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. రాజస్థాన్‌లో ఈమధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో కీలక పాత్ర పోషించిన చంద్రశేఖర్‌ను తెలంగాణలోకి దించారు అమిత్ షా.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 17, 2024 | 02:25 PMLast Updated on: Jan 17, 2024 | 2:25 PM

Eyeing 2024 Lok Sabha Polls Bjp Moves Key Rajasthan Bjp Leader To Telangana

BJP CHANDRASEKHAR: తెలంగాణ బీజేపీలో లీడర్ల గ్రూపుల రచ్చ అంతా ఇంతా కాదు. అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల ముందు మంచి స్వింగ్‌లో ఉన్న పార్టీని గ్రూప్ తగాదాలతో మూడో స్థానానికి తెచ్చారు. సరే.. ఎలాగొలా 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినా.. సీనియర్ లీడర్లు మాత్రం ఇంకా అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. దాంతో లోక్‌సభ ఎన్నికల నాటికైనా తెలంగాణ బీజేపీని సెట్ చేయకపోతే కష్టం అనుకున్నారు సీనియర్ లీడర్ అమిత్ షా. అందుకే రాజస్థాన్‌లో గ్రూప్ రాజకీయాలను దారిలో పెట్టిన చంద్రశేఖర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

Lakshadweep: లక్షద్వీప్ లక్ష్యం పర్యాటకమే కాదు.. మోదీ తిరుగులేని ప్లాన్..

రాజస్థాన్‌లో ఈమధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో కీలక పాత్ర పోషించిన చంద్రశేఖర్‌ను తెలంగాణలోకి దించారు అమిత్ షా. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలే బీజేపీకి కీలకం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు చోట్లా అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకోవాలని ప్లాన్ చేస్తోంది బీజేపీ అధిష్టానం. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్‌కి కూడా మరీ బంపర్ మెజారిటీ స్థానాలు కూడా రాకపోవడంతో.. బీజేపీకి స్కోప్ ఉందని భావిస్తున్నారు అమిత్ షా. అందుకే రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై 10 సీట్లు టార్గెట్ పెట్టారు. రాజస్థాన్‌లో బీజేపీ గెలిచాక.. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై గ్రూపులుగా విడిపోయారు సీనియర్ లీడర్లు. మాజీ సీఎం వసుంధర రాజే వర్గాన్ని బుజ్జగించి.. ఆ రాష్ట్రానికి.. మొదటిసారి గెలిచిన భజన్ లాల్ శర్మను ఎంపికచేయడంలో చంద్రశేఖర్ కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు చెందిన చంద్రశేఖర్‌కి.. తెలంగాణలో పార్టీ బలాలు, బలహీనతలను అమిత్ షా వివరించినట్టు సమాచారం. రాజస్థాన్‌లాగే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఫలితాలు చూపించాలని ఆయనకు లక్ష్యంగా పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ లీడర్లు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒకరికొకరు పొంతన లేకుండా ప్రచారం చేసుకున్నారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య అస్సలు పడటం లేదు. అలాగే రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్ కూడా బండితో విభేదిస్తున్నారు. అటు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తన ఓటమికి స్థానిక నేతలే కారణమని మండిపడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీలు బండి సంజయ్, అర్వింద్, బాపూరావు తమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలవలేకపోయారు. ఇక కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కూడా తన సొంత ఎంపీ నియోజకవర్గం సికింద్రాబాద్‌లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా సాధించలేకపోయారు. ఎన్నికల ముందు కొనసాగిన నేతల విభేదాలు.. తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నాయి. స్వయంగా అమిత్ షా హెచ్చరించినా ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు చంద్రశేఖర్‌ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం వల్ల ఈ గ్రూప్ రాజకీయాలకు చెక్ పడతాయా.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న సీట్లు సాధిస్తుందా అన్నది చూడాలి. రాజస్థాన్‌లో వర్కవుట్ అయిన చంద్రశేఖర్ మ్యాజిక్.. తెలంగాణలో ఎంతమేరకు పనిచేస్తుంది అన్నది తొందర్లోనే తెలియనుంది.