Gas cylinder at Rs 500: తెల్ల రేషన్ కార్డు ఉన్నా లాభం లేదు.. వాళ్లకే రూ. 500 గ్యాస్ సిలిండర్..
ఈ 6 గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకంలో భాగంగా 5వందల రూపాయలకే సిలిండర్ అందించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఈ పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులైన లబ్దిదారులను ఆశా కార్యకర్తలు ఎంపిక చేస్తారు.
Gas cylinder at Rs 500: ఆరుగ్యారంటీలు అంటూ హామీలు గుప్పించిన కాంగ్రెస్.. తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మహిళా సంక్షేమానికి రేవంత్ పెద్దపీట వేస్తున్నారు. పార్టీ అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేశారు. ఆ తర్వాత ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని సీఎం రేవంత్ చెప్తున్నారు.
Jasprit Bumrah: చరిత్ర సృష్టించిన బూమ్రా.. టెస్టుల్లో నెంబర్ 1 బౌలర్ ర్యాంక్
ఐతే ఈ 6 గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకంలో భాగంగా 5వందల రూపాయలకే సిలిండర్ అందించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఈ పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులైన లబ్దిదారులను ఆశా కార్యకర్తలు ఎంపిక చేస్తారు. ఈ కార్యకర్తలు డోర్ టూ డోర్ వెళ్లి రేషన్ కార్డు, ఇతర ధృవపత్రాలను పరిశీలించనున్నారు. అర్హులైనవారి పూర్తి వివరాలను నమోదు చేసుకుంటారు. తెల్ల రేషన్ కార్డు కలిగి.. గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తించనుంది. తెలంగాణలో సుమారు 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయ్. అందులో 64లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ గుర్తించింది.
దీంతో మిగిలిన సుమారు 26 లక్షల కార్డులకు గ్యాస్ కనెక్షన్ లేనట్లే. ఈ లెక్కన 64 లక్షల కార్డుదారులకు మాత్రమే 5వందల రూపాయలకు గ్యాస్ వర్తించే అవకాశం ఉందని లెక్కలు చెప్తున్నాయ్. అంటే 26 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డ్ ఉన్నా ఉపయోగం లేదు. ఈ 26లక్షల మందికి ఈ పథకంతో ఏ మాత్రం ఉపయోగం ఉండదు. ఐతే.. ఈ 26లక్షల మంది కొత్త గ్యాన్ కలెక్షన్స్ తీసుకుంటే మాత్రం.. ఈ పథకం వర్తించనుంది.