T CONGRESS: ఎప్పుడంటే.. తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారంటే..
పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు లక్ష రూపాయలతో పాటు.. తులం బంగారం ఇస్తామని ఎన్నికల హామీల్లో కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఈ పథకం ఎప్పటి నుంచి అమలు అవుతుందా అని జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
T CONGRESS: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ తన మార్క్ పాలన చూపిస్తున్నారు. బీఆర్ఎస్ సర్కార్ తప్పులను ఎత్తిచూపుతూనే.. తాము ఏం చేస్తాం, ఏం చేయగలం అని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. వరుస సమీక్షలు నిర్వహిస్తూ.. పాలనలో వేగం చూపిస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఆరు గ్యారంటీలు కీలక పాత్ర పోషించాయ్. ముఖ్యంగా మహాలక్ష్మీ పథకం.. హస్తానికి అధికారం దగ్గర చేసింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.
Japan Tsunami Warning: జపాన్‌లో భూకంపం.. సునామీ వార్నింగ్.. మన మీద ఎఫెక్ట్ ఉంటుందా ?
మహిళలకు ఉచిత బస్సు పథకంపై.. అద్భుతమైన స్పందన లభిస్తుండగా.. ఇప్పుడు అందరినీ వెంటాడుతున్న అనుమానం ఒక్కటే.. అదే తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారా అని ! పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు లక్ష రూపాయలతో పాటు.. తులం బంగారం ఇస్తామని ఎన్నికల హామీల్లో కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఈ పథకం ఎప్పటి నుంచి అమలు అవుతుందా అని జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే దీనిపై అధికార పార్టీ నుంచి గుడ్‌న్యూస్ వినిపించింది. డిసెంబర్ 7 తర్వాత పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి స్కీమ్ కింద లక్ష రూపాయతో పాటు.. తులం బంగారం అందించేందుకు సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ కీలక ప్రకటన చేశారు. ఇచ్చిన హామీని కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించారు. జీవన్ రెడ్డి ప్రకటనతో జనాల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
ఇక అటు గత ప్రభుత్వ హయాంలో.. ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకున్న అనేక మంది దరఖాస్తులు కూడా ఇంకా పెండింగ్‌లో ఉన్నాయ్. ప్రభుత్వం మారిన తర్వాత వారు కూడా తమకు లక్షతో పాటు తులం బంగారం వస్తుందని ఆశిస్తున్నారు. తమకు కూడా ఇలానే ఇవ్వాలని ఇప్పటికే దరఖాస్తు చేసుకుని సాయం పొందని వారంతా కోరుతున్నారు. దీంతో కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం ఎలా ఉండబోతుంది.. ఎలాంటి నిబంధనలు విధించబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.