హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన, ఈ ప్రాంతాల వాళ్లు జాగ్రత్త…!
హైదరాబాద్‌లో వర్షం దంచి కొడుతోంది. మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుద్బుల్లాపూర్‌లో వర్షం పడుతోంది. ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

Hail rains in the states today. Alert for these districts..
హైదరాబాద్‌లో వర్షం దంచి కొడుతోంది. మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుద్బుల్లాపూర్‌లో వర్షం పడుతోంది. ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మొన్నటి వరకూ తీవ్రమైన ఎండలతో ఉడికిపోయిన హైదరాబాద్ ప్రజలు అనూహ్యంగా కురుస్తున్న చిరుజల్లులను ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి కారణంగా మరికొద్ది రోజులు ఈ రకమైన పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది వాతావరణ శాఖ.
ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాగల రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని వెల్లడించింది. ఆ తరువాత క్రమంగా రెండు నుండి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ రోజు గరిష్టంగా అదిలాబాద్ లో 38.8 కనిష్టంగా హైదరాబాద్ లో 33.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అకాల వర్షాలు అన్నదాతలకు కష్టాలను మిగిల్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వర్షాల కారణంగా వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట పాడవడంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు.