Kavitha Letter from Jail : నన్ను చిత్రవధ చేస్తున్నారు…బయటకు తీసుకెళ్ళండి… కవిత 4 పేజీల లెటర్
ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరికించి... తనను శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. న్యాయమూర్తికి హ్యాండ్ రైటింగ్ లో రాసిన నాలుగు పేజీల లెటర్ లో తన బాధను వ్యక్తం చేశారు. తనను చిత్రవధ చేస్తున్నారనీ...తీహార్ జైలు నుంచి బయటకు పంపించాలని లెటర్లో వేడుకున్నారు కవిత.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరికించి… తనను శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. న్యాయమూర్తికి హ్యాండ్ రైటింగ్ లో రాసిన నాలుగు పేజీల లెటర్ లో తన బాధను వ్యక్తం చేశారు. తనను చిత్రవధ చేస్తున్నారనీ…తీహార్ జైలు నుంచి బయటకు పంపించాలని లెటర్లో వేడుకున్నారు కవిత.
తీహార్ జైల్లో ఉన్న కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను మరో 14 రోజుల పాటు పొడిగించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. గతంలో విధించిన రిమాండ్ ముగియడంతో తీహార్ జైలు అధికారులు తిరిగి ఆమెను కోర్టుకు తీసుకొచ్చారు. తనపై కుట్ర పూరితంగా… రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని కామెంట్ చేశారు కవిత. తాను చెప్పదలుచుకున్న అంశాలను లెటర్లో రాసినట్టు తెలిపారు. కోర్టు మళ్ళీ రిమాండ్ విధించడంతో తిరిగి తీహార్ జైలుకు తరలించారు.
రౌస్ ఎవెన్యూ కోర్టు న్యాయమూర్తిని ఉద్దేశించి రాసిన లెటర్లో తన ఆవేదనను వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. ఇంగ్లీషులో నాలుగు పేజీల లెటర్ ను రాశారామె. లిక్కర్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదనీ… ఈడీ, CBI ఆరోపిస్తున్నట్టు ఎలాంటి ఆర్థిక పరమైన లాభం చేకూరలేదని తెలిపారు. లిక్కర్ కేసులో బాధితురాలని అనీ… రెండేళ్ల నుంచి కేసు విచారణ ఎటూ తేలడం లేదని లెటర్లో రాశారు కవిత. CBI, ED ఇన్వెస్టిగేషన్ కన్నా మీడియా విచారణ ఎక్కువగా జరుగుతోందని ఆరోపించారు. రాజకీయ పరపతిని దెబ్బతీసేలా మీడియాలో వివరిస్తున్నారనీ… తన మొబైల్ నెంబర్ ను అన్ని ఛానళ్ళలో వేసి ప్రైవసీ భంగం కలిగించినట్టు కవిత తెలిపారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్టను దెబ్బతీసేలాగా వ్యవహరించారని ఆరోపించారు.
దర్యాప్తు అధికారుల ముందు 4 సార్లు విచారణకు హాజరయ్యాను. బ్యాంకు వివరాలు కూడా ఇచ్చి విచారణకు అన్ని విధాలా సహకరించా… నా మొబైల్ ఫోన్లు అన్నీ అందించా. కానీ వాటిని ధ్వంసం చేసినట్టు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లుగా కేసులో భాగంగా అనేక సోదాలు చేశారు. భౌతికంగా, మానసికంగా వేధించారు. చాలామందిని అరెస్ట్ చేశారు. స్టేట్ మెంట్స్ తరచుగా మారుస్తూ… వాటిని ఆధారం చేసుకుని కేసును నడిపిస్తున్నారని కవిత ఆరోపించారు. సాక్షులను బెదిరిస్తున్నట్టు తనపై ఆరోపణలు చేస్తున్న ఈడీ, తెలంగాణలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఇప్పుడెందుకు అరెస్టు చేశారని లెటర్లో అడిగారు కవిత.
రెండున్నర ఏళ్ళు దర్యాప్తులో ఫెయిల్ అయిన తర్వాత ఈడీ తనను అరెస్ట్ చేసిందని ఆరోపించారు కవిత. సుప్రీంకోర్టులో కఠిన చర్యలు తీసుకోబోమని చెప్పినా… అరెస్ట్ చేశారనీ… ఈడీలో 95% కేసులన్నీ ప్రతిపక్ష పార్టీల నేతలకు చెందినవే అంటూ ఆరోపణలు చేశారు కవిత. బీజేపీలోకి చేరిన వెంటనే ఆ కేసుల విచారణ ఆగిపోతుందని తెలిపారు. పార్లమెంటు సాక్షిగా బీజేపీ లీడర్లు… విపక్ష నేతలనుద్దేశించి నోరు మూసుకోండి లేదంటే… ఈడీని పంపుతామని బెదిరించినట్టు కవిత తన లెటర్లో న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో విపక్ష పార్టీలన్నీ న్యాయవ్యవస్థ వైపు చూస్తున్నాయనీ… కోర్టు ఉపశమనం కల్పిస్తుందని ఆశతో ఉన్నాము. కేసు దర్యాప్తునకు సహకరించేందుకు నేను పూర్తి సిద్ధంగా ఉన్నా… ఈ పరిస్థితుల్లో నాకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నాను అని లెటర్లో రాశారు కవిత. తన చిన్న కుమారుడు పరీక్షల ప్రిపేర్ అవుతున్న టైమ్ లో తల్లిగా తనతో ఉండాలి. నా పాత్రను ఎవరు భర్తీ చేయలేరని తెలిపారు. తాను లేకపోవడంతో కుమారుడిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నానని తెలిపారు. బెయిల్ అభ్యర్థనను పరిశీలించాల్సింది అని న్యాయమూర్తిని లెటర్లో కోరారు ఎమ్మెల్సీ కవిత.