Kavita arrested : కవిత ఇంట్లో ఏం జరిగింది?
ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Case) కీలక పరిణామాలు జరిగాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సోదాలు.. ఆ తర్వాత అరెస్ట్.. ఆ వెంటనే ఢిల్లీకి తీసుకెళ్లడం.. అంతా పక్కాగా జరిగిపోయింది. ఇంతకీ ఎమ్మెల్సీ కవిత (Kavita) ఇంట్లో సోదాలు, అరెస్ట్‌పై ఈడీ ఏం చెబుతోంది. అసలు కవిత ఇంట్లో ఏం జరిగింది ?

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసింది ఈడీ. సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాలకు కవితను అరెస్ట్ చేసినట్లు ఆమె భర్త అనిల్‌కుమార్‌కు సమాచారం ఇచ్చింది. కవిత అరెస్ట్ పై 14 పేజీల సమాచారాన్ని అనిల్‌కుమార్‌కు ఇచ్చినట్లు ఈడీ చెబుతోంది.
కవిత అరెస్టు (Kavita arrested) ప్రొసీజర్‌కు సంబంధించి ఈడీ ఒక పంచనామాను తయారుచేసింది. మధ్యాహ్నం 1.45 నుంచి సాయంత్రం 6.45 వరకు సెర్చ్ చేసినట్టు పంచనామాలో పేర్కొన్నారు. అంతకు ముందే.. అంటే 5.20కి అరెస్ట్ చేసినట్టు పంచనామాలో తెలిపారు. PMLA యాక్ట్, సెక్షన్ 19 కింద కవితను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. 6 గంటల ప్రాంతంలో కవిత సోదరుడు కేటీఆర్‌తో పాటు మరో 20 మంది చట్టవిరుద్ధంగా వచ్చి ప్రక్రియను అడ్డుకున్నట్టు విచారణ అధికారులు పంచనామాలో తెలిపారు.
ఈడీ తనిఖీలు అరెస్ట్ వ్యవహారమంతా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్ర నేతృత్వంలో జరిగింది. హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన తర్వాత .. కవితను ఢిల్లీకి తీసుకెళ్లారు. రాత్రి ఈడీ కార్యాలయానికి తరలించారు. ఉదయం మెడికల్ టెస్టుల తర్వాత విచారణ జరుగుతోది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్టును కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈడీ అదుపులో ఉన్న అమిత్ అరోరా సమాచారంతో కవితను అరెస్టు చేశారు. గత నాలుగు రోజుల నుంచి అమిత్ అరోరాను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. సౌత్ లాబీకి సంబంధించి కీలక సమాచారాన్నిఅమిత్ అరోరా నుంచి సేకరించారు. ఢిల్లీ లిక్కర్స్ స్కాంలో సౌత్ లాబీ గ్రూప్ కీలకంగా వ్యవహరించింది. ఉదయం అమిత్ అరోరాతో కలిపి కవితను విచారించే అవకాశం ఉంది.