KAVITHA CONTEST : ఇందూరులో పోటీకి.. కవిత భయపడుతున్నారా ?
బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ, కేసీఆర్ (KCR) కూతురు కవిత నిజామాబాద్ (Nizhnamabad) ఎంపీగా పోటీ చేయట్లేదా ? ధర్మపురిని అరవింద్ (Dharmapuri Arvind) ని ఓడించి తీరుతానన్న ప్రతిజ్ఞ గట్టున పెట్టేశారా ? పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ... జాగృతి మీద కవిత ఎందుకు దృష్టిపెట్టారు?
బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ, కేసీఆర్ (KCR) కూతురు కవిత నిజామాబాద్ (Nizhnamabad) ఎంపీగా పోటీ చేయట్లేదా ? ధర్మపురిని అరవింద్ (Dharmapuri Arvind) ని ఓడించి తీరుతానన్న ప్రతిజ్ఞ గట్టున పెట్టేశారా ? పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా … జాగృతి మీద కవిత ఎందుకు దృష్టిపెట్టారు? ఇకపై బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుపోతారా ? గత మూడు నెలలుగా ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వైఖరి గులాబీ శ్రేణులకు ఎంతం మాత్రం అంతుపట్టడం లేదు.
కవిత… బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనల్లో పాల్గొనకుండా సొంత ఎజెండాతో పనిచేస్తుండటం ఆశ్చర్యంగా ఉంది. అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు, మహిళలకు tspsc ఉద్యోగాల్లో కోటా తగ్గిందని… tspsc లో ఆంధ్రవాళ్ళని సభ్యులుగా నియమించారని… ఇలా ఏదీ కూడా BRS పార్టీ పరంగా కాకుండా తెలంగాణ జాగృతి (Telangana Awakening) తరపున సొంత ఎజెండాతోనే ముందుకెళ్తున్నారు కవిత. ఇటీవల జరిగిన ఏ లోక్ సభ ఎన్నికల సమీక్షా సమావేశంలోనూ కవిత కనిపించలేదు. గతంలో నిజామాబాద్ ఎంపీగా నిలబడి … ధర్మపురి అరవింద్ చేతిలో ఓడారు. మళ్ళీ ఇందూరు నుంచి పోటీ చేస్తారా అన్నదానిపై క్లారిటీ లేదు. పోటీ చేసే ఆలోచనే ఉంటే నియోజకవర్గ సమీక్షల్లో పాల్గొనాలి. కానీ అది జరగలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కవిత ప్రచారం చేశారు. 2018లో ఇక్కడ 8 స్థానాల్లో గులాబీ పార్టీ గెలిస్తే… ఈసారి రెండుకే పరిమితమైంది.
నిజామాబాద్ లో బీఆర్ఎస్ కి వ్యతిరేకత ఉండటంతో… కవిత పోటీకి భయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇందూరుకు పసుపు బోర్డు కేటాయించడంతో బీజేపీకి కొంత సానుకూలత ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ నడుస్తోంది. దాంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జనం ఆ పార్టీ వైపు కూడా టర్న్ అయ్యే ఛాన్సుంది. కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉండటంతో… నిలబడటానికి కవితకి ధైర్యం చాలడం లేదన్న డౌట్స్ వస్తున్నాయి.
అసలే BRSకు లోక్ సభ అభ్యర్థులు దొరకట్లేదు. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి కూడా పోటీకి దిగకపోతే ఎలా అని పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ కూతుర్ని నిజామాబాద్ లో పోటీకి దించట్లేదనీ… దమ్ముంటే నిలబెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం మీటింగ్ లో సవాల్ విసిరారు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ కుండా… బీఆర్ఎస్-బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందనీ… అందుకే నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ పై పోటీకి దిగడం లేదని ఆరోపించారు. ఇది నిజమేనా ? పోటీకి దూరంగా ఉండటానికే… జాగృతి పేరు చెప్పుకొని లోక్ సభ ఎన్నికలకు సైడ్ అయిపోవాలని కవిత ప్లాన్ చేస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి.