KTR : ఎలా ఉండే కేటీఆర్ పరిస్థితి.. ఎలా అయిపోయింది పాపం..
కేటీఆర్.. ఈ పేరు ఓ బ్రాండ్‌గా వినిపించేది ఒకప్పుడు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కేసీఆర్ తర్వాత నంబర్ 2గా చక్రం తిప్పిన కేటీఆర్‌కు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
కేటీఆర్.. ఈ పేరు ఓ బ్రాండ్‌గా వినిపించేది ఒకప్పుడు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కేసీఆర్ తర్వాత నంబర్ 2గా చక్రం తిప్పిన కేటీఆర్‌కు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలా ఉంది అనుకున్నారు అనేవాళ్లు ఉన్నారు అది తర్వాత సంగతి. సినిమా స్టార్‌కు సమానమైన క్రేజ్ అటు సోషల్ మీడియాలో.. ఇటు గ్రౌండ్ లెవల్‌లో కేటీఆర్‌కు కనిపించేది. కట్ చేస్తే.. బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. సీన్ పూర్తిగా మారిపోయింది. ఫ్యాన్స్ అనుకున్న వాళ్లంతా దూరం అయ్యారు. బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణ ఐటీకి గడ్డుకాలమే అంటూ ఆ మధ్య సోషల్ మీడియాలో హడావుడి జరిగినా.. ఆ తర్వాత అది పెయిడ్ అని కన్ఫార్మ్ అయింది. ప్రభుత్వం మారితే చాలా మారతాయ్ అనడానికి కేటీఆర్‌కు ఎదురవుతున్న పరిస్థితులే బెస్ట్ ఎగ్జాంపుల్.
దీంతో ఎలా ఉండే కేటీఆర్.. ఎలా అయిపోయాడు పాపం అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయ్. ఒకప్పుడు కేటీఆర్ పేరు ఎత్తి మాట్లాడ్డానికే ఆలోచించేవాళ్లు చాలామంది. అలాంటిది ఇప్పుడు కేటీఆర్‌ను లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకుంటున్నారు. తెలంగాణ నేతల సంగతి ఎలా ఉన్నా.. పక్క రాష్ట్రాల నాయకులు కూడా ఇప్పుడు కేటీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు. మాటలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. జనాలంతా కలిసి ఓడించినా, కేటీఆర్ చెల్లెలు కవితను జైలుకు పంపినా… కేటీఆర్‌కు ఇంకా పొగరు తగ్గలేదు అంటూ ఏపీ టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. వాస్తవంగా ఈ మధ్య ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్… చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. అప్పుడు ఏపీ ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఏపీలో జగన్ ఎందుకు ఓడారో ఎవరికీ అర్థం కావడం లేదు అంటూ ఆయన మాట్లాడిన మాటలు.. సైకిల్ పార్టీ నేతలకు కోపం తెప్పిస్తున్నాయ్. ఒకరి తర్వాత ఒకరు.. ఒకరికి మించి ఒకరు అన్నట్లుగా కేటీఆర్‌తో కబాడీ ఆడుకుంటున్నారు.
తెలంగాణ కష్టాలు పట్టించుకో చాలు.. ఏపీ సంగతి నీకెందుకు బాస్ అంటూ సోమిరెడ్డి వాళ్లు నిలదీస్తున్నారు. గులాబీ పార్టీని జనాలు నేలకేసి కొట్టిన కూడా… కేటీఆర్‌కు పొగరు తగ్గలేదని ఫైర్ అయ్యారు. అటు మంత్రి సత్యకుమార్ కూడా కేటీఆర్ మీద ఘాటు విమర్శలు గుప్పించారు. ఏమైనా పరిస్థితి బాలేనప్పుడు మౌనంగా ఉండాలి.. మన పరిస్థితి ఏంటో చూసుకోవాలి.. అంతే తప్ప.. పక్కోడి రాజకీయాల్లో వేలు పెడతా అంటే.. మొదటికే మోసం వచ్చే చాన్స్ ఉంటుంది. ఇక్కడే బీఆర్ఎస్ ఖాళీ అవుతున్న పరిస్థితి. అలాంటిది ఏపీ రాజకీయాల గురించి మీకెందుకు బాస్. కేటీఆర్ ఇప్పటికైనా ఇది గుర్తించాలని.. అప్పుడే పరిస్థితులు బాగుపడతాయనే కామెంట్లు వినిపిస్తున్నాయ్.