KCR : నేడు కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన..
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) మరో సారి పొలంబాట పట్టబోతున్నారు. ఇటీవల ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటనలో రైతుల కష్టాలు తెలుసుకున్న కేసీఆర్..

KCR's visit to Karimnagar district today..
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) మరో సారి పొలంబాట పట్టబోతున్నారు. ఇటీవల ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటనలో రైతుల కష్టాలు తెలుసుకున్న కేసీఆర్.. ఈరోజు కరీంనగర్ (Karimnagar) లో ఎండిన పంటలను పరిశీలించబోతున్నారు. మొగ్దుంపూర్ లో ఎండిన పంటల పరిశీలన అనంతరం రైతుల (Farmers) తో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు, వారి కష్టాలను అడిగి తెలుసుకుంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) నివాసంలో భోజనం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2:00 గంటలకు బోయినపల్లి మండల కేంద్రంలో ఎండిన వరి పొలాలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకోనున్నారు. తిరిగి సాయంత్రం 3:00 గంటలకు శాభాష్‌పల్లి బ్రిడ్జి (Sabhashpalli Bridge) వద్ద మిడ్ మానేరు ప్రాజెక్టును సందర్శిస్తారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కీలక నేతలతో గులాబీ దళపతి సమావేశం అవుతారని సమాచారం. ఈ భేటీ అనంతరం సాయంత్రం 4:00 గంటలకు సిరిసిల్ల (Sirisilla) పట్టణంలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో కేసీఆర్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.