KTR, MP : ఎంపీగా కేటీఆర్.. పోటీ ఎక్కడి నుంచి అంటే..
తెలంగాణలో ఊహించని పరాజయాన్ని అందుకున్న బీఆర్ఎస్ పార్టీ.. త్వరలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తన పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకు బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు రెడీ అవుతోంది. అందుకోసం పార్లమెంట్ నియోజకరవ్గాలవారీగా ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తోంది. అయితే ఈసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్లమెంట్ బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉండగా.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంట్‌కు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
తెలంగాణలో ఊహించని పరాజయాన్ని అందుకున్న బీఆర్ఎస్ పార్టీ.. త్వరలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తన పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకు బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు రెడీ అవుతోంది. అందుకోసం పార్లమెంట్ నియోజకరవ్గాలవారీగా ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తోంది. అయితే ఈసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్లమెంట్ బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉండగా.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంట్‌కు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ ముఖ్య నేతలు కొందరు కేటీఆర్.. వద్ద ప్రస్తావించగా.. ఆయన ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నారట.
దీంతో ఇది నిజమే అనే వాదన మొదలైంది. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. కేవలం 39 స్థానాలకే పరిమితమైంది. దానికి తోడు బీఆర్ఎస్ జాతీయ పార్టీకి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ గొంతు బలంగా వినిపించేదుకు కేటీఆర్‌ను పార్లమెంట్ బరిలో నిలపాలని కేసీఆర్ యోచినస్తున్నట్లు తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన బీఆర్ఎస్.. తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆ స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో 9 బీఆర్ఎస్ గెలిచింది. 4 బీజేపీ, 3 కాంగ్రెస్, హైదరాబాద్ లోక్‌సభ ఎంఐఎం దక్కించుకున్నాయి. రీసెంట్‌గా జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 7 లోక్‌సభ స్థానాల పరిధిలోనే మెజార్టీ సాధించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దృష్ట్యా స్వల్ప ఆధిక్యాలు వచ్చిన లోక్‌సభ స్థానాలను దక్కించుకోవడానికి బీఆర్ఎస్ ఇప్పుడు మరింత కష్టపడాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలని చూస్తున్నారు గులాబీ బాస్. మల్కాజిగిరి లేదా సికింద్రాబాద్ స్థానాల్లో ఏదో ఓ చోట నుంచి కేటీఆర్‌ను ఎంపీగా బరిలోకి నిలపాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. మల్కాజిగిరి పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందగా.. సికింద్రాబాద్ పరిధిలోని ఆరు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఓ చోటు నుంచి ఆయన్ను బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నారట. కేటీఆర్‌ను పార్లమెంట్‌కు పంపి.. జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేయటంపై ఫోకస్ చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారని సమాచారం.