KUMARI AUNTY: కుమారి ఆంటీ గిఫ్ట్.. రేవంతన్నకు కుమారి ఇచ్చే గిఫ్ట్ అదే..
కుమారి ఆంటీ. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న ఆమె.. సోషల్ మీడియా పుణ్యమాని సూపర్ ఫేమస్ అయింది. యూట్యూబ్ ఛానెల్స్ కుమారి ఆంటీని బాగా ప్రమోట్ చేశాయ్. దీంతో ఫుడ్ లవర్స్ పోటెత్తారు. హైదరాబాద్ వాళ్లే కాదు.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కుమారి ఆంటీ ఫుడ్ టేస్ట్ చేసేవాళ్లు.
KUMARI AUNTY: సోషల్ మీడియా వాడే ప్రతీ ఒక్కరు ఇప్పుడు మాట్లాడుకుంటున్న పేరు.. కుమారి ఆంటీ. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న ఆమె.. సోషల్ మీడియా పుణ్యమాని సూపర్ ఫేమస్ అయింది. యూట్యూబ్ ఛానెల్స్ కుమారి ఆంటీని బాగా ప్రమోట్ చేశాయ్. దీంతో ఫుడ్ లవర్స్ పోటెత్తారు. హైదరాబాద్ వాళ్లే కాదు.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కుమారి ఆంటీ ఫుడ్ టేస్ట్ చేసేవాళ్లు. సెలబ్రిటీలు కూడా కుమారి ఆంటీ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Gaddar Awards: గద్దరన్నకు నిజమైన నివాళి.. నంది అవార్డులు కాదు.. గద్దర్ అవార్డులు..
దీంతో ఆ ప్రాంతంలో క్రౌడ్ పెరిగిపోయింది. ట్రాఫిక్ సమస్య వచ్చింది. ఫలితంగా కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి.. రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని తేల్చిచెప్పేశారు. మరో ప్రాంతానికి ఫుడ్ స్టాల్ మార్చాలని డిసైడ్ చేశారు. తనకు వేరే జీవనాధారం లేదని.. తన పొట్టకొడుతున్నారని కుమారి ఆంటీ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వ్యవహారం సీఎం రేవంత్ వరకు వెళ్లింది. ఆమె మీద పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఇక అదే ప్రాంతంలో ఫుడ్ స్టాల్ పెట్టుకునేందుకు అనుమతులు జారీ చేయాలని సూచించడంతో పాటు.. ఒకరోజు కుమారి ఆంటీ ఫుడ్‌స్టాల్‌కు వచ్చి భోజనం కూడా చేస్తానని అన్నారు. ఐతే తనకు ఇంత మేలు చేసిన రేవంత్‌కు.. ధన్యవాదాలు తెలుపుకునేందుకు కుమారి ఆంటీ సిద్ధం అయ్యారు.
తమ బతుకులు రోడ్డున పడకుండా కాపాడిన రేవంత్‌కు మంచి గిఫ్ట్ ఇస్తానని అంటున్నారు. సీఎం స్థాయి వ్యక్తికి.. కుమారి ఆంటీ ఏం గిఫ్ట్ ఇస్తుందా అని ఎక్కువ ఆలోచించకండి. సీఎం రేవంత్‌కు ఇష్టమైన కూర వండి పెట్టి.. ఆయనకు థ్యాంక్స్ చెప్తానని.. అదే తనకు ఇచ్చే గిఫ్ట్ అని కుమారి అంటున్నారు. ఇక అటు సీఎం రేవంత్ నాన్ వెజ్ ప్రియులు. మటన్ మరింత ఇష్టంగా తింటారు. కుమారి ఆంటీ మటన్ కర్రీ కూడా చాలా ఫేమస్. ఇదే కూరను రేవంత్‌కు కుమారి ఆంటీ వండిపెట్టాలంటూ.. సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది.