SAYANNA ANNIVERSARY : సాయన్న వర్ధంతి జరిగిన మూడు రోజులకే…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే (Cantonment MLA) లాస్య నందిత (Lasya Nandita) కారు ప్రమాదంలో (Road Accident) చనిపోవడంతో కుటుంబసభ్యులు షాక్ లో ఉన్నారు. ఏడాదిగా ఆ కుటుంబాన్ని విషాదాలు వెంటాడుతున్నాయి. 2023 ఫిబ్రవరి 19 నాడు సాయన్న అనారోగ్యంతో చనిపోయారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే (Cantonment MLA) లాస్య నందిత (Lasya Nandita) కారు ప్రమాదంలో (Road Accident) చనిపోవడంతో కుటుంబసభ్యులు షాక్ లో ఉన్నారు. ఏడాదిగా ఆ కుటుంబాన్ని విషాదాలు వెంటాడుతున్నాయి. 2023 ఫిబ్రవరి 19 నాడు సాయన్న అనారోగ్యంతో చనిపోయారు. మూడు రోజుల క్రితమే ఆయన మొదటి వర్థంతి…అంటే సంవత్సరీకం పూర్తయింది. ఈ సందర్భంగా రాజకీయ నేతలు, కార్యకర్తలు, అభిమానులు… సాయన్న ఇంటికి వెళ్ళి నివాళులర్పించారు.
సాయన్న మరణించి… మొదటి వర్థంతిని పూర్తి చేసుకున్న మూడు రోజులకే ఆయన కుమార్తె… కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో చనిపోయారు. తండ్రి మరణించిన ఏడాదికే… ఇదే ఫిబ్రవరి నెలలో కుమార్తె కూడా చనిపోవడంతో సాయన్న కుటుంబం తల్లిడిల్లిపోతోంది. సాయన్న మరణం తర్వాత.. అసెంబ్లీ ఎన్నికల్లో.. బీఆర్ఎస్ (BRS) పార్టీ తరపున లాస్య నందిత పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో తండ్రి చేసిన కార్యక్రమాలను లాస్య నందిత కొనసాగిస్తోంది.. అనుకుంటున్న టైంలోనే యాక్సిడెంట్ లో ఆమె చనిపోయారు. గత మూడు నెలలుగా నందితను మృత్యువు వరుసగా వెంటాడిందని జరిగిన సంఘటనలను బట్టి తెలుస్తోంది.
మూడు నెలల క్రితం బోయినపల్లిలో ఓ లిఫ్ట్ లో నందిత చిక్కుకుపోయారు. పై అంతస్తు నుంచి లిఫ్ట్ కింద పడింది. అతి కష్టమ్మీద… గంట తర్వాత లిఫ్ట్ ఓపెన్ చేసి నందితను బయటకు తీసుకొచ్చారు.
ఆ తర్వాత నల్గొండలో కేసీఆర్ (KCR) సభలో పాల్గొని వస్తుండగా ఎమ్మెల్యే కారుకు యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో కారు డ్యామేజ్ అయినా.. లాస్యకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈమధ్యే ఆమె హైఫీవర్ తో హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకున్నారు. ORR పై జరిగిన యాక్సిడెంట్ లో లాస్య చనిపోయారు.
తండ్రి సాయన్న సంవత్సరీకం ముగిసిన మూడో రోజునే.. లాస్య కారు ప్రమాదంలో చనిపోయింది. దాంతో కుటుంబ సభ్యులతో పాటు… కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, నేతలు కన్నీరు మున్నీరవుతున్నారు. మొన్ననే అన్నకు నివాళులర్పించి వెళ్ళాం… ఇంతలోనే లాస్యకు కూడా నివాళులు అర్పించాల్సి వచ్చిందని కన్నీళ్ళు పెట్టుకున్నారు.