Telangana Rains : నేడు, రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు..

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ (Department of Meteorology) తేలికపాటి వర్ష సూచన చేసింది. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 24, 2024 | 09:23 AMLast Updated on: Feb 24, 2024 | 9:23 AM

Light To Moderate Rains In Telangana Today And Tomorrow

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ (Department of Meteorology) తేలికపాటి వర్ష సూచన చేసింది. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్టోబర్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల (southwest monsoon) తిరోగమనం ప్రారంభమవుతుందని పేర్కొంది. హైదరాబాద్ సహా మొత్తం రాష్ట్రం సెప్టెంబర్ చివరి వరకు సాధారణ వర్షపాతం ఉంటుందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉంటే గత మూడు రోజులుగా రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఖమ్మం, నల్లగొండలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

అక్టోబర్ ప్రారంభంలో వాతావరణం క్రమంగా మారుతుందని తెలిపింది. సోమవారం, మంగళవారాల్లో వివిధ జిల్లాల్లో నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, సిద్ధిపేటతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. మరోవైపు నల్గొండ, ఖమ్మం మినహా మిగతా జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయని పేర్కొంది. HYD, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయని తెలిపింది. ఇక రాష్ట్రంలో ఈరోజు కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.