Liquor Sales New Year 2024:  తెగ తాగేశారు భయ్యా ! 3 రోజుల్లో 700 కోట్ల మద్యం సేల్స్

కొత్త ఏడాదికి సరిగ్గా మూడు రోజుల ముందు నుంచి తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి.  దాదాపు 700 కోట్ల రూపాయల మద్యం అమ్ముడు పోయిందని అధికారులు చెబుతున్నారు.  ఇంకా డిసెంబర్ 31న మొత్తం అమ్మకాలను ఇందులో కలపలేదు.  అది కూడా కలిస్తే ఇంకా ఎక్కువే ఉండొచ్చు.  ఒక్క హైదరాబాద్ లోనే  ఏడాది చివరి రోజున 40 కోట్ల రూపాయల మద్యం అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 1, 2024 | 12:36 PMLast Updated on: Jan 01, 2024 | 1:07 PM

Liquor Sales New Year 2024

కొత్త ఏడాది వేడుకలు అంటే చాలు… చాలామందికి కిక్కు… ముక్క ఉండాల్సిందే. తెలంగాణలో ఏ పండక్కి అయినా ముఖ్యంగా మందు లేనిది ముద్ద దిగదు అంటారు. ఇక కొత్త సంవత్సరంను ఎంజాయ్ చేసేందుకు ముక్కతో పాటు సుక్క కోసం భారీగా ఖర్చుపెట్టారు జనం.  ఆదివారం మధ్యాహ్నం నుంచి యూత్ బార్ అండ్ వైన్స్ దగ్గర భారీగా క్యూలు కట్టారు. రాత్రి దాకా క్యూలు కొనసాగుతూనే ఉన్నాయి.  బీర్లతో పాటు హార్డ్ ను కూడా భారీగా అమ్మారు నిర్వాహకులు.

డిసెంబర్ 29,30,31 ల్లో తెలంగాణ రాష్ట్రంలో 700 కోట్ల రూపాయల దాకా మద్యం, బీరు అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. 650 కోట్ల రూపాయలు వైన్ షాపుల్లో, హోటల్స్, క్లబ్బులు, పబ్బుల్లో 50 కోట్ల రూపాయల దాకా మద్యం సేల్స్ జరిగాయి.  డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గంటల దాకా మద్యం షాపులు తెరిచేందుకు అధికారులు పర్మిషన్ ఇచ్చారు.  పబ్బులు, క్లబులు రాత్రి ఒంటి గంట దాకా నడిచాయి. దాంతో ఒక్క హైదరాబాద్ లోనే థర్టీ ఫస్ట్ నైట్ 40 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్టు అంచనా వేస్తున్నారు.  గత ఏడాది ఈ ఒక్క రోజు రాష్ట్రం మొత్తం మీద 216 కోట్ల రూపాయల మందు అమ్ముడుపోయింది.  ఈసారి 260 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు.   డిసెంబర్ 31 ఒక్క రాత్రే హైదరాబాద్ సిటీ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మొత్తం 3 వేల 200 నమోదు అయ్యాయి.   హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్స్ పరిధిలో పోలీసులు ఈ కేసులు పెట్టారు.  డ్రంకెన్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో 400 మందికి 200 పైగా యూనిట్స్ చూపించింది… అంటే ఎంత దారుణంగా తాగారో అర్థమవుతుంది.

మద్యంతో పాటు కూల్ డ్రింక్స్ కూడా భారీగా అమ్ముడుపోయాయి.  చికెన్, మటన్, చేపలకు కూడా విపరీతమైన గిరాకీ కనిపించింది.  సాధారణ రోజుల్లో రోజుకి 3 లక్షల కిలోల చికెన్ అమ్ముతుంటే… ఆదివారం ఒక్క రోజే నాలుగున్నర లక్షల కిలోల చికెన్ అమ్ముడుపోయింది.  బిర్యానీలకు ఈసారి కూడా ఫుల్ డిమాండ్ కనిపించింది.  ప్రముఖ హోటళ్ళు, రెస్తారెంట్లు… ప్రత్యేకంగా కిచెన్లు ఏర్పాటు చేసి బిర్యానీ పార్శిల్స్ అమ్మాయి.  కేకుల కంటే కూడా బిర్యానీలకే డిమాండ్ కనిపించింది.