బ్రేకింగ్: మత్తు కోసం మెడికల్ డ్రగ్ ఇంటర్ విద్యార్థి మృ*తి
హైదరాబాద్‌లో యువత మత్తుకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. మత్తు కోసం ఎంతటికైనా తెగించేందుకు సిద్ధపడుతున్నారు. మత్తు లేకపోతే ఉండలేకపోతున్నారు.

హైదరాబాద్‌లో యువత మత్తుకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. మత్తు కోసం ఎంతటికైనా తెగించేందుకు సిద్ధపడుతున్నారు. మత్తు లేకపోతే ఉండలేకపోతున్నారు. ఈ క్రమంలో మత్తుకు అలవాటు పడిన ఇంటర్ విద్యార్థులు ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. మత్తు కోసం ఏకంగా మెడికల్ డ్రగ్స్ తీసుకున్నారు. ఈ ఘటనలో ఒక విద్యార్థి చనిపోగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాలాపూర్‌కు చెందిన ముగ్గురు ఇంటర్ చదివే విద్యార్థులు మత్తు కోసం మెడికల్ షాపులో డ్రగ్స్ కొనుగోలు చేశారు.
ఇంజక్షన్ తో పాటు టాబ్లెట్లను ఒకేసారి తీసుకోవడంతో డోసేజ్ ఎక్కువ అయ్యింది. దీంతో విద్యార్థులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఇందులో సాహిల్ అనే విద్యార్థి చనిపోగా.. మరో ఇద్దరు విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. విద్యార్థులకు మెడికల్ డ్రగ్స్ అమ్మిన సాహిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.