Venkatesh : నేడు ఖమ్మంలో సినీ హీరో వెంకటేష్ ఎన్నికల ప్రచారం..
నేడు ఖమ్మంలో సినీనటుడు (Movie Actor) వెంకటేశ్ పర్యటించనున్నారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డి తరపున ప్రముఖ సినీ హీరో వెంకటేష్ (Venkatesh) నేడు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ (Congress Party) అభ్యర్థి, ఆయన వియ్యంకుడైన రామసహాయం రఘురామిరెడ్డి (Raghurami Reddy) మద్దతుగా.. ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Movie hero Venkatesh's election campaign in Khammam today..
నేడు ఖమ్మంలో సినీనటుడు (Movie Actor) వెంకటేశ్ పర్యటించనున్నారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డి తరపున ప్రముఖ సినీ హీరో వెంకటేష్ (Venkatesh) నేడు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ (Congress Party) అభ్యర్థి, ఆయన వియ్యంకుడైన రామసహాయం రఘురామిరెడ్డి (Raghurami Reddy) మద్దతుగా.. ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు మయూరి సెంటర్ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్డు వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం రాత్రి ఎనిమిది గంటలకు కొత్తగూడెం క్లబ్‌లో జరిగే ప్రముఖుల సమ్మేళనానికి వెంకటేశ్ హాజరవుతారు. ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాల్లో వెంకటేశ్ పర్యటించి ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. రఘురామిరెడ్డికి హీరో వెంకటేష్, మంత్రి పొంగులేటి (Minister Ponguleti) వియ్యంకులు అవుతారు. దీంతో తన వియ్యంకుడిని లోక్సభ ఎన్నికల్లో గెలిపించేందుకు వెంకటేష్ రంగంలోకి దిగుతున్నారు.
Suresh SSM