MUKESH AMBANI COSTLY THINGS: కోట్లల్లో ఆస్తులు.. అనంత్ అంబానీ వాచీ 8 కోట్లు ! ఖరీదైనవి ఇవే..

ఈ భారీ వేడుకల్లో పెళ్ళికొడుకు అనంత్ అంబానీ చేతికి పెట్టుకున్న వాచ్ ఖరీదుపై చర్చ సాగుతోంది. ఆ వాచ్ కాస్ట్ 8 కోట్ల రూపాయలట. ఇంత విలువైన వాచ్ చూసి.. ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్, ఆయన సతీమణి షాక్ అయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 4, 2024 | 04:41 PMLast Updated on: Mar 04, 2024 | 4:42 PM

Mukesh Ambani And Family Have These Costly Things They Use Daily

MUKESH AMBANI COSTLY THINGS: దేశంలోనే సూపర్ బిలియనీర్.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. ఇప్పుడు ఆయన చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్ళి గురించి దేశమంతా చర్చ జరుగుతోంది. వీళ్ళిద్దరి పెళ్ళి జులైలో జరగబోతోంది. జామ్ నగర్‌లో అంబరాన్ని అంటేలా నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఆదివారమే ముగిశాయి. ఈ సెలబ్రేషన్స్ కోసమే వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఖర్చుపెడుతున్నారు. ఈ వేడుకలకు వివిధ దేశాలకు చెందిన కార్పొరేట్ కంపెనీల CEOలు, సెలబ్రిటీలు, ప్రముఖులు, క్రికెటర్లు భారీగా వచ్చారు. బిల్ గేట్స్, మార్క్ జుకర్ బర్గ్‌తోపాటు హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఫంక్షన్‌కు హాజరయ్యారు.

Nita Ambani: జ‌స్ట్ లైక్ ఎ వావ్.. 500 కోట్ల నగలు ధరించిన నీతా అంబానీ

ఈ భారీ వేడుకల్లో పెళ్ళికొడుకు అనంత్ అంబానీ చేతికి పెట్టుకున్న వాచ్ ఖరీదుపై చర్చ సాగుతోంది. ఆ వాచ్ కాస్ట్ 8 కోట్ల రూపాయలట. ఇంత విలువైన వాచ్ చూసి.. ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్, ఆయన సతీమణి షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. జుకర్ బర్గ్, ఆయన భార్య ప్రిసిల్లా కలిసి అనంత్ అంబానీతో మాట్లాడారు. జుకర్ బర్గ్ భార్య.. అనంత్ వాచీ చాలా బాగుందని అనడం వీడియోలో కనిపించింది. అనంత్ అంబానీ ఇది రిచర్డ్ మిల్లర్ బ్రాండ్‌కి చెందిన వాచీ అని చెప్పాడు. ఆ వాచ్ బ్రాండ్ గురించి చాలా మంది నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు. రిచర్డ్ మిల్లర్ బ్రాండ్‌కి చెందిన వాచీలు 80వేల డాలర్ల నుంచి మొదలై 1 మిలియన్ డాలర్ల దాకా కాస్ట్ ఉన్నాయి. అంటే ఆ వాచ్ ఖరీదు మన లెక్కల్లో 8 కోట్ల రూపాయలకు పైగానే ఉండొచ్చు. ఇవే కాదు.. ముఖేష్ అంబానీ పిల్లలు ముగ్గురూ లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో ముఖేష్ అంబానీ కూతురు ఇషా.. తన పెళ్లిలో రూ.90 కోట్ల రూపాయల విలువైన లెహంగా వేసుకుంది. ఆమెకు ముంబైలోని వార్లీలో.. సముద్రానికి ఎదురుగా ఖరీదైన మాన్షన్ హౌస్ ఉంది. దాని ఖరీదు 452 కోట్ల రూపాయలు.

Anil Ambani: అయ్యో అనిల్‌.. బ్యాగులు మోస్తూ.. దూరందూరంగా.. అన్నకొడుకు పెళ్లిలో అనామకుడిలా అనిల్‌..

ఇషా, ఆమె భర్త ఆనంద్ పిరమల్‌కు మెర్సిడెజ్ బెంజ్ S క్లాస్ గార్డ్ కారు ఉంది. దాని కాస్ట్ 10 కోట్ల రూపాయలు. ఇది కాకుండా ఇషాకు పర్సనల్‌గా 4 కోట్ల విలువైన బెంట్లీ కారు కూడా ఉంది. అలాగే ఆమె 165 కోట్ల రూపాయల డైమండ్ నెక్లెస్ వేసుకుంటుంది. ఇక ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాష్ అంబానీకి.. ఆంటిలియా ఎస్టేట్‌లో ఓ పెద్ద భవనం ఉంది. 15 వేల కోట్ల రూపాయల విలువైన ఆ భవంతిలో ఆకాశ్, భార్య శ్లోకా ఉంటున్నారు. రూ.60 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్, కోటీ 80 లక్షల నుంచి 4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ వాగ్ కార్లు కూడా ఉన్నాయి. పెళ్ళి కొడుకు అనంత్ అంబానీకి కూడా దుబాయ్‌లోని పామ్ జుమెరియాలో బీచ్‌కి ఎదురుగా ఖరీదైన విల్లా ఉంది. 640 కోట్ల రూపాయలతో ముఖేష్ అంబానీ ఈ ఇంటిని చిన్న కొడుక్కి కొనిపెట్టాడు. ఆంటిలియా ఎస్టేట్ గ్యారేజీలో కోటీ 42 లక్షల విలువైన బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్స్ అనంత్‌కి ఉన్నాయి. ఆకాష్, అనంత్ అంబానీ.. ఇద్దరికీ కోట్ల రూపాయల విలువైన రేంజ్ రోవర్ కార్లు, BMWలు, మెర్సిడెస్ బెంజ్ కార్లు కూడా ఉన్నాయి. 117 బిలియన్ డాలర్లతో ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో 10వ స్థానంలో ఉన్నారు. ఇండియాలో ఫస్ట్ ప్లేస్ ఆయనదే.