Komati Reddy Family : కాంగ్రెస్‌ కొంపలో నల్లగొండ కుంపటి.. కోమటిరెడ్డి ఫ్యామిలీతో తిప్పలు తప్పవా?

తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress) లో నల్గొండ (Nalgonda) ఎంపీ (MP) సీటు కుంపటిగా మారబోతోందా. మరోసారి ఈ సీటు విషయంలో కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్‌కు తిప్పలు తప్పవా. ఈ రెండు ప్రశ్నలకు దాదాపు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే నల్గొండ ఎంపీ టికెట్‌ కోసం కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కూతురు శ్రీనిధి రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అటు భువనగిరి ఎంపీ టికెట్‌ కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మీ ప్రయత్నిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 5, 2024 | 09:54 AMLast Updated on: Feb 05, 2024 | 9:54 AM

Nalgonda Kumpati Komati Reddy Family In Congress Kompa

తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress) లో నల్గొండ (Nalgonda) ఎంపీ (MP) సీటు కుంపటిగా మారబోతోందా. మరోసారి ఈ సీటు విషయంలో కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్‌కు తిప్పలు తప్పవా. ఈ రెండు ప్రశ్నలకు దాదాపు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే నల్గొండ ఎంపీ టికెట్‌ కోసం కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కూతురు శ్రీనిధి రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అటు భువనగిరి ఎంపీ టికెట్‌ కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మీ ప్రయత్నిస్తున్నారు. ఇలా రెండు సీట్ల కోసం ఒకే కుటుంబానికి చెందని వ్యక్తులు పోటీ పడటం ఇప్పుడు కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పగా మారబోతోంది అనే వాదనకు తెరలేపింది. భువనగిరి ఎంపీ టికెట్‌ విషయం పక్కన పడితే నల్గొండ ఎంపీ సీటు మాత్రం హాట్‌ కేకులా మారిపోయింది. ఈ సీటు కోసం చాలా మంది సీనియర్‌ నేతలు పోటీ పడుతున్నారు. తమ వారసులను రంగంలోకి దింపి గ్రౌండ్‌ వర్క్‌ చేయిస్తున్నారు.

ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి (Komatireddy Venkata Reddy) తన కూతురు శ్రీనిధిని రంగంలోకి దింపేందుకు హైకమాండ్‌ను ఒప్పించే పనిలో ఉన్నట్టు సమాచారం. అమెరికాలో బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ చేసిన శ్రీనిధి రెడ్డి రీసెంట్‌గా ఇండియాకు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి కోమటిరెడ్డి తరఫున ప్రచారం కూడా చేశారు. నల్గొండ ప్రజల నుంచి కూడా శ్రీనిధి రెడ్డి విషయంలో పాజిటివ్‌ టావ్‌ వస్తోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఇదే సీటు కోసం మరో సీనియర్‌ నేత పటేల్‌ రమేష్‌ రెడ్డి కూడా పోటీ పడుతున్నారు. రీసెంట్‌గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట టికెట్‌ కోసం రమేష్‌ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్‌ హైకమాండ్‌ మాత్రం ఆ టికెట్‌ను రాంరెడ్డి దామోదర్‌ రెడ్డికి కేటాయించింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో నల్గొండ టికెట్‌ ఇస్తామంటూ రమేష్‌ రెడ్డికి హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు రమేష్‌ రెడ్డి ఊహించని విధంగా శ్రీనిధి రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.

దీంతో రమేష్‌ రెడ్డితో పాటు ఆయన అనుచరవర్గం మొత్తం తీవ్ర అసహనంలో ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు వీళ్లిద్దరిలో పార్టీ ఎవరికి టికెట్‌ ఇస్తుంది అన్న విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటు నల్గొండ నుంచి వెంకట్‌ రెడ్డి కూతురు ఉండటం. అటు భువనగిరి నుంచి కూడా రాజగోపాల్‌ భార్య కోసం టికెట్‌ ప్రయత్నాలు చేయడం కాంగ్రెస్‌లో మరో చర్చకు దారితీస్తోంది. కాంగ్రెస్‌ నియమాల ప్రకారం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే టికెట్‌ కేటాయిస్తారు. పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు ఈ రూల్స్‌ను బ్రేక్‌ చేస్తారు కూడా. మరి ఇప్పుడు కోమటిరెడ్డి కుటుంబం విషయంలో కూడా ఈ రూల్‌ను బ్రేక్‌ చేస్తారా.. లేక ఎవరో ఒకరికే టికెట్‌ ఇస్తారా చూడాలి. అటు నల్గొండలో శ్రీనిధికి టికెట్‌ ఇస్తే రమేష్‌ రెడ్డి నిర్ణయం ఎలా ఉండబోతోంది అనే విషయం కూడా ఇప్పుడు ఆ జిల్లా రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. మరి కాంగ్రెస్‌ ఈ సిచ్యువేషన్‌ను ఎలా టాకిల్‌ చేస్తుందో చూడాలి.