TSPSC Constables Training : ఏప్రిల్ 1 నుంచి కొత్త కానిస్టేబుల్స్ ట్రైనింగ్..
తెలంగాణ రాష్ట్ర పోలీస్ (Telangana State Police) శాఖలోని ఖాలీల భర్తీ ప్రక్రియలో భాగంగా ఇటీవల ఎంపికైన TSPSC కానిస్టేబుల్ (Constable) అభ్యర్థులకు వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి కొత్త కానిస్టేబుల్స్ ట్రైనింగ్ ప్రారంభం కానున్నాయి.

New constable training from April 1.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ (Telangana State Police) శాఖలోని ఖాలీల భర్తీ ప్రక్రియలో భాగంగా ఇటీవల ఎంపికైన TSPSC కానిస్టేబుల్ (Constable) అభ్యర్థులకు వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి కొత్త కానిస్టేబుల్స్ ట్రైనింగ్ ప్రారంభం కానున్నాయి.
కాగా ఇప్పటికే ఫేజ్ -1 లో సివిల్, ఏఆర్ తదితర విభాగాల అభ్యర్థులకు మొదటి దశలో ఫిబ్రవరి 21 నుంచి శిక్షణ ప్రారంభం అయ్యింది. కాగా.. తగిన సౌకర్యాలు లేకపోవడంతో మిగతా వారికి శిక్షణను తాత్కాలికంగా వాయిదా వేశారు. శిక్షణ కేంద్రాలు సద్దుబాటు కావడంతో ఫేజ్ 2 TSPSC కాని స్టేబుల్ పోస్టులకు ఎంపికైన 4250 మంది మంది కానిస్టేబుళ్లకు ఏప్రిల్ 1 నుంచి శిక్షణ ప్రారంభిస్తామని టీఎస్‌ఎస్పీ (TSPSC) వెల్లడించింది. ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఇదివరకే నియామక పత్రాలు అందజేశారు.