Congress Government : తెలంగాణలో నామినేటెడ్ పోస్టులు.. వాళ్ళకి మాత్రమే అంటున్న రేవంత్
తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టిపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సంక్రాంతి లోపే ఈ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నారు. జనవరి 6తో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ముగుస్తుంది. ఆ తర్వాతే నామినేటెడ్ పై ఫోకస్ చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత తయారు చేసిన జాబితాను పార్టీ అధిష్టానానికి పంపించి అనుమతి తీసుకుంటారు. పార్టీలో కష్టపడ్డ వారికే పదవులు దక్కుతాయని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.

ఈనెల 6న ప్రజాపాలన కార్యక్రమం ముగిసిన తర్వాత తెలంగాణలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సంక్రాంతి లోపే ఈ పని పూర్తవనుంది. న్యూఇయర్ విషెస్ చెప్పడానికి వచ్చిన జర్నలిస్టులతో నామినేటెడ్ పోస్టుల భర్తికి సంబంధించి కొన్ని విషయాలను మాట్లాడారు. తనతో క్లోజ్ గా ఉన్న వారికి, పార్టీలో పలుకుబడి కలిగిన వారికి కాకుండా… పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడిన వారికి మాత్రమే ఈ పోస్టులను ఇస్తామన్నారు. అలాగే ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని గుర్తు చేశారు.
నామినేటెడ్ పోస్టుల్లో ఎవరిని కూర్చోబెట్టాలన్నది ఈనెల 6 తర్వాత సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తారు. జిల్లాల వారీగా పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల సలహాలు, సూచనలు, సిఫార్సులను తీసుకుంటారు. తర్వాత ఓ జాబితాను తయారు చేసి… దాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపుతారు. అక్కడ అనుమతి తీసుకున్నాక… సంక్రాంతి లోపు లేదంటే తర్వాత గానీ నామినేటెడ్ పోస్టుల భర్తీ జరుగుతుంది. తెలంగాణ వచ్చిన పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ పోస్టుల కోసం పార్టీ నేతల్లో తీవ్ర పోటీ ఉంది. కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులతో పాటు… డైరెక్టర్ పదవుల కోసం కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు.
ఎంపిక విషయంలో సామాజిక సమీకరణాలు, జిల్లాల వారీ ప్రాతినిధ్యం, పార్టీలో అనుభవం, కష్టపడిన తీరు లాంటి అంశాలను రేవంత్ లెక్కలోకి తీసుకునే అవకాశముంది. బుధవారం పీసీసీ విస్తృత స్థాయి సమావేశం గాంధీభవన్ లో జరుగుతోంది. పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఈ సమావేశం తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చే అవకాశముంది.