CM Revanth Reddy : రేవంత్‌కు రాహుల్‌ మరో టాస్క్‌.. అసలు సవాల్‌ ముందుందా..

కర్ణాటక, తెలంగాణలో అధికారంలో దక్కించుకున్న కాంగ్రెస్‌.. సౌత్‌లో మంచి జోష్‌ మీద కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే చూపించాలని స్ట్రాటజీలు సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి ఎండింగ్‌ లేదంటే.. మార్చిలో పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్. దీంతో ఇప్పటినుంచే హస్తం పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. లోక్‌సభ ఎన్నికలపై ఇప్పటికే ఆ పార్టీ అధినాయకత్వం కసరత్తు ముమ్మరం చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 7, 2024 | 04:46 PMLast Updated on: Jan 07, 2024 | 4:47 PM

Rahul Is Another Task For Revanth Is The Real Challenge Ahead

కర్ణాటక, తెలంగాణలో అధికారంలో దక్కించుకున్న కాంగ్రెస్‌.. సౌత్‌లో మంచి జోష్‌ మీద కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే చూపించాలని స్ట్రాటజీలు సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి ఎండింగ్‌ లేదంటే.. మార్చిలో పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్. దీంతో ఇప్పటినుంచే హస్తం పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. లోక్‌సభ ఎన్నికలపై ఇప్పటికే ఆ పార్టీ అధినాయకత్వం కసరత్తు ముమ్మరం చేసింది. మిత్రపక్షాలతో సీట్ల పంపకం కూడా ఫైనల్‌ స్టేజీకి వచ్చేసింది. లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రాల వారీగా ఎలక్షన్ కమిటీలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా.. తెలంగాణ సీఎం రేవంత్‌కు మరో టాస్క్ ఇచ్చింది కాంగ్రెస్‌. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల బాధ్యతను అప్పజెప్పింది. ప్రదేశ్ ఎలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా రేవంత్‌ను నియమించింది.

ఈ కమిటీలో డిప్యూటీ సీఎం సహా.. పలువురు మంత్రులు, సీనియర్ నేతలకు చోటు కల్పించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ రేవంత్‌పై పూర్తి నమ్మకం ఉంచిన కాంగ్రెస్‌ పార్టీ.. మరోసారి ఆయనపైనే భారం వేసింది. ప్రస్తుతం దక్షిణాదిన కాంగ్రెస్ పూర్తిగా పట్టు సాధించింది. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించగా.. తమిళనాడులో మిత్రపక్షం డీఎంకే అధికారంలో ఉంది. కేరళలోనూ కాంగ్రెస్‌కు మంచి ఫలితాలే వస్తాయని భావిస్తున్నారు. ఇక తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. 12 స్థానాలు చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్లాన్‌ చేస్తోంది. ఇందులో భాగంగానే రేవంత్‌ రెడ్డికి ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించింది. లోక్‌సభ సభ్యుల ఎంపిక, వారి బలాబలాలు, సామాజిక సమీకరణాలు విశ్లేషించి ఏఐసీసీకి నివేదిక ఇవ్వనున్నారు.

ఈ నివేదిక ఆధారంగానే అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేయనుంది. కమిటీలో ఉన్న పలువురు సభ్యులు సైతం లోక్‌సభ టికెట్ రేసులో ఉన్నారు. వీరిలో జానారెడ్డి, బలరాం నాయక్‌, వంశీచంద్ రెడ్డి. అంజన్‌ కుమార్ యాదవ్ లాంటి నేతలు లోక్‌సభ టికెట్ రేసులో ఉన్నారు. ఐతే లోక్‌సభ ఎన్నికల బాధ్యత తీసుకున్న రేవంత్‌కు.. అసలు సవాళ్లు ఇకపై ఎదురుకాబోతున్నాయా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలతో కంపేర్‌ చేస్తే.. పార్లమెంట్‌ ఎన్నికలు చాలా డిఫరెంట్‌. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచామని.. లోక్‌సభ ఎలక్షన్‌కు రిలాక్స్ అవడానికి ఉండదు. జనాల మూడ్‌ వేరే ఉంటుంది. తీర్పు కూడా వేరే ఉంటుంది. ఢిల్లీ లెవల్‌లో ఆలోచించి జనాలు ఓట్లు వేస్తారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ.. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో పాగా వేసింది.

ఇది చాలు జనాల మూడ్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి ! పైగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన ఓటు బ్యాంక్ బీజేపీలో కొత్త జోష్‌ నింపింది. 10 స్థానాల్లో విజయమే టార్గెట్‌గా కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇక అటు బీఆర్ఎస్‌ కూడా తగ్గేదే లే అంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవానికి.. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతీకారం చూపించాలని ఫిక్స్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో, పోటీ మధ్య.. కాంగ్రెస్‌కు తెలంగాణ నుంచి మెజారిటీ సీట్లు గెలిపించడం.. రేవంత్‌కు కచ్చితంగా టఫ్‌ అవడం ఖాయం. ఒకరకంగా ఇది సవాల్‌లాంటిదే.