REVANTH VS NANI: కొడాలి నానిని రానీయొద్దు! నో ఎంట్రీ అంటున్న రేవంత్..

సర్జరీ అయి రెస్ట్ తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించడానికి.. స్వయంగా వచ్చి కలిశాడు జగన్. కానీ రేవంత్‌కు మాత్రం కనీసం కాల్ చేయలేదు. మొన్న ఓ ఇంటర్వ్యూలో రేవంత్ స్వయంగా ఈ విషయం చెప్పడంతో ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని రాయబారానికి సిద్ధమయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 8, 2024 | 04:24 PMLast Updated on: Jan 08, 2024 | 6:59 PM

Revanth Reddy Refused To Meet Ysrcp Mla Kodali Nani

REVANTH VS NANI: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసి నెలరోజులు గడిచాయి. సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లో వివిధ పార్టీల నేతలు విషెస్ చెప్పారు. ప్రధాని మోడీతో పాటు కొందరు కేంద్ర మంత్రులూ రెస్పాండ్ అయ్యారు. కానీ ఏమైందో ఏమో.. ఏపీ సీఎం జగన్ మాత్రం రేవంత్‌కి శుభాకాంక్షలు చెప్పలేదు. సర్జరీ అయి రెస్ట్ తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించడానికి.. స్వయంగా వచ్చి కలిశాడు జగన్. కానీ రేవంత్‌కు మాత్రం కనీసం కాల్ చేయలేదు. మొన్న ఓ ఇంటర్వ్యూలో రేవంత్ స్వయంగా ఈ విషయం చెప్పడంతో ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని రాయబారానికి సిద్ధమయ్యారు.

GUDIVADA AMARNATH: అమర్నాథ్‌కు టిక్కెట్ ఖాయం! పెందుర్తిలో టీడీపీ, జనసేనకు చెక్

కానీ నానికి అపాయింట్‌మెంట్ ఇవ్వొద్దని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకోడానికి గుడివాడ ఎమ్మెల్యే నాని అపాయింట్‌మెంట్ కోరాడు. ఏవో పర్సనల్‌గా మాట్లాడాలని అడిగాడు నాని. కానీ అందుకు రేవంత్ తిరస్కరించారు. అపాయింట్‌మెంట్ ఇవ్వొద్దని అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారట. రేవంత్ అసలు కోపమంతా.. ఏపీ సీఎం జగన్ మీదే. రేవంత్ సీఎం అయ్యాక కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. పైగా ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత.. ఢిల్లీలో తనకు తెలిసిన అన్ని పార్టీల్లోని ఎంపీలకు ధావత్ ఇచ్చారు రేవంత్. ఈ డిన్నర్‌కు వైసీపీ ఎంపీలు కూడా హాజరయ్యారు. కానీ తర్వాత ఆ ఎంపీలకు జగన్ క్లాస్ తీసుకున్నారట. రేవంత్ విందుకు ఎందుకు వెళ్ళారని నిలదీశారట. ఆయనే బి-ఫామ్ ఇస్తాడు.. తెచ్చుకోండి అని ఎద్దేవా చేశారట జగన్. ఈ విషయాలన్నీ మొన్నీమద్య ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సర్జరీ చేయించుకున్న మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించేందుకు స్వయంగా ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు జగన్. కానీ తనకు మాత్రం కనీసం ఫోన్ కూడా చేయలేదని రేవంత్ కామెంట్ చేశారు.

”మోడీని పీఎం చేయాలని జగన్ కోరిక.. రాహుల్‌ని ప్రధాని చేయాలన్నది నా కోరిక. కేసీఆర్‌ను ఓడించాలని నేను పోరాడితే.. గెలిపించాలని ఏపీ సీఎం జగన్ అనుకున్నారు” అని విమర్శించారు రేవంత్. అయినాసరే జగన్‌ను ప్రత్యర్థిగా భావించడం లేదన్నారు. జగన్ చెల్లెలు.. వైఎస్ షర్మిల ఈమధ్యే ఏపీ కాంగ్రెస్‌లో చేరారు. ఆమె పీసీసీ అధ్యక్షురాలు కూడా అవుతారని చెప్పారు సీఎం రేవంత్. షర్మిలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. పైగా ఏపీలో జగన్ టిక్కెట్ ఇవ్వని వారికి కాంగ్రెస్ తరపున తాను షర్మిలతో మాట్లాడి టిక్కెట్లు ఇప్పిస్తానన్నారు. ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరడానికి కారణం.. షర్మిల గురించి మాట్లాడటానికే అంటున్నారు కొందరు విశ్లేషకులు. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ మీద రేవంత్ రెడ్డి కోపంగా ఉండటం వల్లే.. నానికి అపాయింట్‌మెంట్ తిరస్కరించినట్టు తెలుస్తోంది.