REVANTH REDDY: గురువారం ఢిల్లీకి రేవంత్.. షర్మిల కోసమేనా..?
పార్టీ పెద్దల సమక్షంలో వైటీపీని షర్మిల కాంగ్రెస్‌లో విలీనం చేసి కండువా కప్పుకోబోతున్నారు. సరిగ్గా అదే రోజు రేవంత్ కూడా ఢిల్లీకి వెళ్లడంపై జనాల్లో రకరకాల చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌లో షర్మిల చేరిక కార్యక్రమంలో రేవంత్ కూడా పాల్గొంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
REVANTH REDDY: తెలంగాణ సీఎం రేవంత్.. ఢిల్లీ పర్యటనకు రెడీ అవుతున్నారు. ఏఐసీసీ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆ మీటింగ్‌లో ప్రధానంగా చర్చ జరగనుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై అగ్రనేతలు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తాము అమలు చేసిన గ్యారంటీల విషయంపై సీఎం రేవంత్ ఈ సమావేశంలో ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయ్. దీంతో పాటు పార్టీ పెద్దల నుంచి నామినేటెడ్ పోస్టులపై క్లారిటీ తీసుకోనున్నారని తెలుస్తోంది.
YS JAGAN ON SHARMILA: జగన్‌కి ఇష్టం లేదా..? షర్మిల ఎంట్రీవేళ.. జగన్ అలా అన్నాడేంటి ?
ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో.. రేవంత్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఐతే ఇది మాత్రమే కాదు.. రేవంత్ టూర్‌లో ఇంతకుమించి ట్విస్టులు ఉండబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం కూడా ఒకరకంగా షర్మిలనే ! ఆమె కూడా గురువారమే ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ పెద్దల సమక్షంలో వైటీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసి కండువా కప్పుకోబోతున్నారు. సరిగ్గా అదే రోజు రేవంత్ కూడా ఢిల్లీకి వెళ్లడంపై జనాల్లో రకరకాల చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌లో షర్మిల చేరిక కార్యక్రమంలో రేవంత్ కూడా పాల్గొంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి తెలంగాణ కాంగ్రెస్‌లో వైటీపీని విలీనం చేసేందుకు షర్మిల చివరి వరకు ప్రయత్నాలు చేశారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను మధ్యవర్తిత్వానికి కూడా దింపారు. తెలంగాణలో కోమటిరెడ్డిలాంటి అగ్రనేతలు కూడా షర్మిల చేరికకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
ఐతే ఆ సమయంలో షర్మిల చేరికను రేవంత్ అడ్డుకున్నారనే ప్రచారం జరిగింది. ఐతే రేవంత్‌ను టార్గెట్ చేస్తూ షర్మిల కూడా ఆ మధ్య విమర్శలు గుప్పించడం.. ఈ ప్రచారానికి మరింత బలం ఇచ్చింది. ఇలాంటి పరిణామాల మధ్య.. షర్మిల చేరిక సమయంలో రేవంత్ అక్కడే ఉంటారా.. ఆ కార్యక్రమంలో పాల్గొంటారా.. లేదంటే ఏఐసీసీ మీటింగ్ చూసుకొని రిటర్న్ అవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.