MAKARA JYOTHI: అయ్యప్ప భక్తులకు షాకింగ్ న్యూస్ ! జ్యోతి దర్శనానికి 50వేల మందికే పర్మిషన్
శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శనం చేసుకోడానికి ప్రతి యేటా వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. మన రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు.. తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి దర్శనానికి వెళ్తున్నారు.
MAKARA JYOTHI: ఎంతో భక్తితో.. 40రోజుల మండల దీక్షతో ఆ మణికంఠుడు.. అయ్యప్పస్వామిని దర్శించుకోడానికి శబరిమల వెళ్తున్న భక్తులకు అడుగడుగునా అడ్డంకులు తప్పడం లేదు. స్వామి దర్శనానికి సరిగా ఏర్పాట్లు చేయలేని కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ ట్రస్ట్ బోర్డ్.. ఇప్పుడు మకరజ్యోతి దర్శనానికి 50 వేల మందికి మాత్రమే అనుమతి ఇస్తామంటోంది. బోర్డు నిర్ణయంపై అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు. శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శనం చేసుకోడానికి ప్రతి యేటా వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. మన రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు.. తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి దర్శనానికి వెళ్తున్నారు.
KCR : ఎందుకు ఓడిపోయారో తెలిసిందా ? 170 కారణాల్లో అసలైనవి లేవేంటి ?
అయితే భక్తులు రద్దీకి తగ్గట్టుగా శబమరిమలలో ఏర్పాట్లు చేయలేకపోతోంది కేరళ ప్రభుత్వం. ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసే ట్రావెన్‌కోర్ ట్రస్ట్ బోర్డు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామి దర్శనం చేయించలేకపోతోంది. తెలుగు రాష్ట్రాల భక్తులు శబరిమలలో ఈమధ్య తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం తినడానికి ఆహారం, నీళ్ళు, వైద్య సదుపాయాలు కూడా లభించడంలేదు. ఇప్పటికీ అలాంటి పరిస్థితే ఉంది. భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతోంది. ఈ ఇష్యూపై బీజేపీతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా కేరళ ప్రభుత్వానికి లెటర్లు రాశారు. ఇప్పుడు ట్రావెన్ఖకోర్ ట్రస్ట్ బోర్డ్ తీసుకున్న మరో నిర్ణయం వివాదస్పదమవుతోంది. సంక్రాంతి రోజు, ఆ తెల్లవారి.. రెండు రోజుల పాటు శబరిగిరుల్లో మకర జ్యోతి దర్శనం ఉంటుంది. దీక్షలు విడిచిన తర్వాత చాలా మంది అయ్యప్ప భక్తులు.. మకర జ్యోతి దర్శనం చేసుకొని ఇంటికి బయల్దేరుతారు. లక్షల మంది భక్తులు ఈ జ్యోతి దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు. కానీ ఈసారి మకరజ్యోతి దర్శనానికి ఒక్కోరోజు 50 వేల మందికి మించి అనుమతి ఇవ్వకూడదని ట్రావెన్‌కోర్ ట్రస్ట్ బోర్డ్ నిర్ణయించింది. జనవరి 14న 40 వేల మందికి, జనవరి 15నాడు 50 వేల మందికి మాత్రమే మకర జ్యోతి దర్శనానికి అనుమతి ఇస్తామని ప్రకటించింది. ఆ రోజు స్లాట్ బుకింగ్స్‌ని కుదిస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.
పైగా ఆరోజు మహిళలు, చిన్నారులకు అస్సలు అనుమతి లేదు. ఈనెల 10 నుంచే స్పాట్ బుకింగ్స్ అన్నీ రద్దు చేస్తున్నట్టు కూడా బోర్డు ప్రకటించింది. భక్తుల రద్దీని తగ్గించడానికే ఈ చర్యలు తీసుకున్నామని సమర్థించుకుంటోంది. మకర జ్యోతి దర్శనానికి భారీగా భక్తులు వస్తారనీ అందుకే ముందు నుంచే స్పాట్ బుకింగ్స్ రద్దు చేస్తున్నట్టు చెబుతున్నారు దేవాలయ అధికారులు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఏర్పాటు చేయలేక చేతులెత్తేసి కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ ట్రస్ట్ బోర్డు.. ఇలా భక్తులంతా పవిత్రంగా భావించే మకర జ్యోతి దర్శనానికి పరిమితులు విధించడం వివాదస్పదమవుతోంది. బోర్డు నిర్ణయాన్ని అయ్యప్ప భక్తులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అయ్యప్ప భక్తుల దర్శనాలతో ఆలయానికి ప్రతియేటా ఆదాయం కోట్లల్లో వస్తోంది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 27 దాకా 40 రోజుల్లో దాదాపు 32 లక్షల మంది భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. వీళ్ళ నుంచి 241 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు బోర్డు తెలిపింది. గత ఏడాది కంటే కూడా 18 కోట్లు అధికంగా ఈసారి వచ్చాయి. జనవరి 20 వరకూ ఇంకా ఆదాయం మరింత పెరిగే అవకాశముంది. అయినప్పటికీ.. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు లేవనీ.. కనీసం మకర దర్శనానికి అయినా అనుమతించాలని అయ్యప్ప భక్తులు కోరుతున్నారు.