హైడ్రా చట్టబద్దత వెనుక పెద్ద టార్గెట్…? ఆ నలుగురికి గురి…?
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజకీయంగా అర్ధం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ. రాజకీయంలో తప్పులను బలంగా మార్చుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఇతర ముఖ్యమంత్రుల తీరుకి ఆయన తీరుకు చాలా తేడా ఉంది.
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజకీయంగా అర్ధం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ. రాజకీయంలో తప్పులను బలంగా మార్చుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఇతర ముఖ్యమంత్రుల తీరుకి ఆయన తీరుకు చాలా తేడా ఉంది. అది హైడ్రా విషయంలో స్పష్టంగా అర్ధమైంది. కూకటపల్లి సహా కొన్ని ప్రాంతాల్లో భవనాలను హైడ్రా కూల్చినప్పుడు… ఆ విభాగం చీఫ్ రంగనాథ్ విచారణకు హాజరు అయ్యారు హైకోర్ట్ లో. ఆ సందర్భంగా హైకోర్ట్ ఓ వ్యాఖ్య చేసింది. అసలు హైడ్రాకు చట్టబద్దత ఉందా…?
ఈ ప్రశ్న తర్వాత వేరే ప్రభుత్వానిధినేతలు అయితే కంగారు పడేవారు ఏమో గాని రేవంత్ మాత్రం దాన్ని ఓ సలహాగా తీసుకున్నారు. కేబినేట్ సమావేశం ఏర్పాటు చేసి హైడ్రాకు చట్టబద్దత కల్పించారు. తర్వాత ఆర్డినెన్స్ ని గవర్నర్ వద్దకు పంపారు. ఆ తర్వాత సైలెంట్ గా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కాంగ్రెస్ అగ్ర నేతలను కలిసి వచ్చారు. అంతే సీన్ ఒక్కసారిగా చేంజ్ అయింది. గవర్నర్ సంతకం పెట్టేసారు, హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ ఓ గెజిట్ కూడా విడుదల అయింది. హైడ్రా విషయంలో కోర్ట్ ల జోక్యం కూడా ఉండదు. కారణం ప్రత్యేక అధికారాలు కల్పించడం.
ఇప్పుడు హైడ్రా విషయంలో ఎవరు ఎన్ని విమర్శలు చేయాలనుకున్నా అది ప్రభుత్వ విభాగం మాత్రమే. మీరు ఆక్రమణలు చేసారని రుజువు చేస్తూ కూల్చేస్తుంది. అందులో ఏ సందేహం లేదు. అసలు ఇంత హడావుడిగా హైడ్రాకు చట్టబద్దత ఎందుకు అంటే… దాని వెనుక పెద్ద గురి ఉందనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. హైడ్రాను అడ్డుకోవడానికి ఓవైసీ రెడీగా ఉన్నారు. ఓవైసీ భవనాలను అనుకున్నంత ఈజీగా కూల్చడం సాధ్యం కాదు. ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి భవనాలను కూడా కూల్చడం కష్టమే. అందుకే హైడ్రాకు ఓ హోదా వచ్చింది.
హైడ్రా చట్టబద్దత వెనుక… బలమైన కారణాలు ఓవైసీ, మల్లారెడ్డి, పల్లా, కేటిఆర్. వీరికి సమాధానం చెప్పడానికి హైడ్రా సిద్దమవుతోంది. అందుకే ఫుల్ పవర్స్ ఇచ్చేసారు రేవంత్ రెడ్డి. త్వరలోనే వీటిని కూల్చవచ్చు. హైకోర్ట్ వ్యాఖ్యల తర్వాత కాస్త కూల్ గా ఉన్న హైడ్రా ఇప్పుడు తమ యంత్రాలను రోడ్లపైకి తీసుకుని రావచ్చు. ఇప్పుడు ఏ చర్యలకు దిగుతుంది అనేదే ఆసక్తికర అంశం. ఇక హైడ్రాకు కేంద్రం మద్దతు ఉందనే ఆరోపణ కేటిఆర్ చేసారు. గవర్నర్ సంతకం చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది అంటున్నారు పరిశీలకులు.
ఓవైసీ మీద రాజకీయ పరంగా కూడా రేవంత్ కు కోపం ఉండవచ్చు. లేదంటే బీఆర్ఎస్ ఆర్ధిక మూలాలను దెబ్బ తీయడం కూడా రేవంత్ లక్ష్యం కావచ్చు అనే అభిప్రాయాలు ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలే హైడ్రాతో ఎక్కువ ఇబ్బంది పడుతుంది. మూసీ బాధితుల విషయంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఇటు బ్యాంకు లోన్లు తీసుకున్న వాళ్ళతో కూడా హైడ్రా చర్చలు జరిపింది. ఇప్పుడు ఏ భవనాలు కూలతాయో, ఏ సంచలనాలు నమోదు అవుతాయో త్వరలోనే తేలిపోతుంది. శనివారం గెజిట్ అంటే సోమవారం హైడ్రా యాక్షన్ మొదలుపెట్టినట్టే అనే అభిప్రాయం కూడా ఉంది.