KCR CHAMBER : ప్రతిపక్షనేతగా కేసీఆర్ కి అవమానం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గగ్గోలు
తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) లో మెజారిటీ సీట్లు దక్కించుకొని కాంగ్రెస్ అధికారం చేపట్టింది. 39 స్థానాలతో సెకండ్ ప్లేస్ లో ఉన్న బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా దక్కింది. తుంటికి ఆపరేషన్ తర్వాత లేట్ గా ఎమ్మెల్యే బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్... తానే ప్రతిపక్ష నేతగా ఉండాలని డిసైడ్ అయ్యారు. గురువారం నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు (Telangana budget meetings) మొదలయ్యాయి.
తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) లో మెజారిటీ సీట్లు దక్కించుకొని కాంగ్రెస్ అధికారం చేపట్టింది. 39 స్థానాలతో సెకండ్ ప్లేస్ లో ఉన్న బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా దక్కింది. తుంటికి ఆపరేషన్ తర్వాత లేట్ గా ఎమ్మెల్యే బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్… తానే ప్రతిపక్ష నేతగా ఉండాలని డిసైడ్ అయ్యారు. గురువారం నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు (Telangana budget meetings) మొదలయ్యాయి. కానీ బడ్జెట్ రోజున అంటే 10నాడు అసెంబ్లీకి రావాలని మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత కేసీఆర్ డిసైడ్ అయ్యారు. దాంతో అపోజిషన్ లీడర్ హోదాలో తమ నేతకు ఇచ్చిన ఛాంబర్ చూద్దామని అసెంబ్లీ ఆవరణలోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షాక్ తిన్నారు.
ప్రతిపక్ష నేతకు యేళ్ళ తరబడి కేటాయిస్తున్న ఆఫీసు కాకుండా… చిన్న రూమ్ ఇవ్వడంతో అవాక్కయ్యారు. మొదటి అసెంబ్లీ సమావేశాలప్పుడు… గతంలో అపోజిషన్ లీడర్ కు ఇచ్చిన ఛాంబరే కేటాయించినా… ఇప్పుడు సడన్ గా ఎందుకు మార్చారని బీఆర్ఎస్ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. 39 మంది ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ప్రతిపక్ష నేత ఆఫీసును ఇన్నర్ లాబీ నుంచి ఔటర్ లాబీకి మార్చారని మండిపడ్డారు. LOP కి చిన్న ఛాంబర్ ఇవ్వడం అంటే కేసీఆర్ ను అవమానించడమే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా పెద్ద రూమ్ ఇచ్చాం… మొన్నటిదాకా భట్టి విక్రమార్కకి కూడా పెద్ద ఛాంబరే ఇచ్చామనీ అసెంబ్లీ స్పీకర్ కు కంప్లయింట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
నియోజకవర్గాల్లో గెలిచిన BRS ఎమ్మెల్యేలను కూడా అవమానిస్తున్నారనీ… అధికారులు, పోలీసులు ప్రొటోకాల్ పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. సంగారెడ్డిలో ఓడిపోయిన అభ్యర్థి భార్యకు ప్రోటోకాల్ ఇచ్చారన్నారు. ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులకు పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వడమేంటి… డీజీపీ కూడా ఆలోచించాలని కోరుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈనెల 10న అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న ప్రతిపక్ష నేత కేసీఆర్… ఈ చిన్న ఛాంబర్ కేటాయింపుపై ఎలా స్పందిస్తారో చూడాలి.