Shanmukh Jaswanth: షణ్ముఖ్ అన్న ఖాతాలో మరికొందరు యువతులు.. వీడు మహాకంత్రిలా ఉన్నాడే..

యూట్యూబర్‌గానే కాకుండా.. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌గానూ షణ్ముక్‌ చాలా ఫేమస్. ప్రస్తుతం బెయిల్ మీద షణ్ముక్‌ బయటకు వచ్చాడు. ఐతే ఈకేసులో అనూహ్యంగా మరికొన్ని నిజాలు బయటకు వస్తున్నాయ్. చాలామంది అమ్మాయిలు.. షణ్ముక్‌ అన్న వల్ల మోసపోయినట్లు తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 24, 2024 | 07:25 PMLast Updated on: Feb 24, 2024 | 7:25 PM

Shanmukh Jaswanth Brother Sampath Vinay Cheated Many Girls

Shanmukh Jaswanth: వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్న యూట్యూబర్ షణ్ముక్‌.. ఇప్పుడు గంజాయి కేసులో చిక్కుకున్నాడు. ఓ యువతిని షణ్ముక్‌ అన్న సంపత్‌ మోసం చేసిన కేసులో పోలీసులు ఇంటికి వెళ్తే.. షణ్ముఖ్ గంజాయి తాగుతూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. డ్రగ్స్ పిల్స్ కూడా దొరికినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం బెయిల్ మీద షణ్ముక్‌ బయటకు వచ్చాడు. ఐతే ఈకేసులో అనూహ్యంగా మరికొన్ని నిజాలు బయటకు వస్తున్నాయ్.

TDP IN RAYALASEEMA: సీమ పాలిటిక్స్.. సీమలో టీడీపీ రెబల్స్ రచ్చ.. ఈ సారైనా సైకిల్ తిరుగుతుందా..?

చాలామంది అమ్మాయిలు.. షణ్ముక్‌ అన్న వల్ల మోసపోయినట్లు తెలుస్తోంది. ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో.. సంపత్‌ను నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత బెయిల్ కూడా ఇచ్చారు. అయితే ఈ కేసు తర్వాత.. సంపత్ వల్ల మోసపోయిన బాధితులు మరికొందరు బయటకు వస్తున్నారు. సంపత్.. తన ఎంబీఏ క్లాస్‌మేట్ అయిన ఓ యువతి దగ్గర.. 2016లో థిక్ షేక్ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెడదామని చెప్పి రూ.20 లక్షలు తీసుకున్నాడనే ప్రచారం జరుగుతోంది. తర్వాత నెలకు రూ.7 వేలు లాభం మాత్రమే చూపించాడట. దీంతో మొత్తం డబ్బులు ఇచ్చేయమని ఆ అమ్మాయి అడగ్గా.. సంపత్ ఈమెని బ్లాక్ చేశాడట. ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని.. పెళ్లికి ఆరు రోజులు ఉందనగా ఓ లేడీ డాక్టర్‌తో పెళ్లికి రెడీ అయ్యాడట. ముంబైలో మరో యువతిని ఇప్పటికే సంపత్ పెళ్లి చేసుకున్నాడట.

ఇలా సంపత్ బారిన పడి చాలామంది అమ్మాయిలు మోసపోయినట్లు, వీళ్లందరూ ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పుడు షణ్ముక్ అన్న చుట్టూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒక్కొక్కరిగా బాధితులు బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. యూట్యూబర్‌గానే కాకుండా.. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌గానూ షణ్ముక్‌.. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. ఐతే ఇప్పుడు అన్న వ్యవహారంతో.. అతను కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.