Smita Sabharwal: స్మితా సబర్వాల్‌కు కీలక బాధ్యతలు.. ఏ పోస్ట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారో తెలుసా
మంత్రుల ప్రమాణ స్వీకారం రోజున సెక్రటేరియట్‌కు వెళ్లారు స్మితా సబర్వాల్. మంత్రి సీతక్క చేత దగ్గరుండి ప్రమాణ స్వీకారం చేయించారు. తాను ఎక్కడికీ వెళ్లడంలేదని.. తెలంగాణలోనే తన సర్వీస్‌ను కొనసాగిస్తానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు.
Smita Sabharwal: స్మితా సబర్వాల్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఐఏఎస్ ఆఫీసర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా పని చేసిన స్మితా సబర్వాల్‌కు.. కేసీఆర్ దగ్గరి మనిషి అని పేరు ఉంది. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యాన్ని వాడుకుని స్మిత చాలా పనులు చేయించుకుంది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది చాలదు అన్నట్టు రేవంత్ రెడ్డి సీఎం అయిన తరువాత స్మిత ఆయనను చాలా రోజులు కలవలేదు.
Chicken, Eggs, Prices : కొండెక్కిన కోడి గుడ్డు.. ఒక గుడ్డు ఎంతో తెలుసా..?
దీంతో ఆమెపై ఆరోపణలతో పాటు విమర్శులు కూడా మొదలయ్యాయి. త్వరలోనే ఆమెను సెంట్రల్‌కు ట్రాన్స్‌ఫర్ చేయబోతున్నారు అంటూ ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఈ విమర్శలకు చెక్ పెట్టాలి అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. మంత్రుల ప్రమాణ స్వీకారం రోజున సెక్రటేరియట్‌కు వెళ్లారు స్మితా సబర్వాల్. మంత్రి సీతక్క చేత దగ్గరుండి ప్రమాణ స్వీకారం చేయించారు. తాను ఎక్కడికీ వెళ్లడంలేదని.. తెలంగాణలోనే తన సర్వీస్‌ను కొనసాగిస్తానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. దీంతో అప్పటి నుంచి స్మితకు ఏ పోస్ట్ ఇస్తారా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఆ సస్పెన్స్‌కు ఇప్పుడు తెర పడింది. తెలంగాణలో 26 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా స్మితా సబర్వాల్‌ను ఫైనాన్స్ కమిషన్ సెక్రెటరీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రీసెంట్‌గానే స్మితకు ఇప్పుడున్న పదవి కాకుండా ఇరిగేషన్ శాఖలో కీలక బాధ్యతలు కూడా అప్పగించారు. కానీ ఆ బాధ్యతలు తాను తీసుకోలేనంటూ ఇండైరెక్ట్‌గా చెప్పారట స్మిత. తన దగ్గర ఉన్న ఫైల్స్ మీద కూడా ఆవిడ సంతకాలు చేయడంలేదని అధికారులు కొందరు మాట్లాడుకున్నారు. ఇలాంటి వాదనల నేపథ్యంలో స్మితను తెలంగాణ నుంచి పంపేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించనట్టు ఆమెకు కీలకపై ఫైన్సాన్స్ కమిషన్‌లో నియమించింది తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్ హయాంలో సీఎం మనిషి అనే పేరున్న స్మిత రేవంత్ హయాంలో ఎలా పని చేస్తారో చూడాలి.