Telangana Cabinet expansion : కేబినెట్ విస్తరణ లేనట్టే ! రేవంత్ కి షాకిచ్చిన హైకమాండ్ !!

తెలంగాణాలో కేబినెట్ విస్తరణ కోసమని ఓ లిస్ట్ తీసుకొని వెళ్ళారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఏమైందో ఏమో... కేబినెట్ లేదు... విస్తరణ లేదు... అంతా మీరే రాసుకుంటున్నారు... మీరే చెబతున్నారు. అన్ని శాఖలకీ మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ఆ అవసరం ఏమొచ్చింది అంటూ ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్ లో తేల్చేశారు రేవంత్ రెడ్డి. దాంతో మంత్రివర్గ విస్తరణపై ఆశ పెట్టుకున్న కాంగ్రెస్ లీడర్లు, BRS జంపింగ్ జపాంగ్స్ డీలా పడ్డారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 28, 2024 | 05:03 PMLast Updated on: Jun 28, 2024 | 5:03 PM

Telangana Cabinet Expansion

తెలంగాణాలో కేబినెట్ విస్తరణ కోసమని ఓ లిస్ట్ తీసుకొని వెళ్ళారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఏమైందో ఏమో… కేబినెట్ లేదు… విస్తరణ లేదు… అంతా మీరే రాసుకుంటున్నారు… మీరే చెబతున్నారు. అన్ని శాఖలకీ మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ఆ అవసరం ఏమొచ్చింది అంటూ ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్ లో తేల్చేశారు రేవంత్ రెడ్డి. దాంతో మంత్రివర్గ విస్తరణపై ఆశ పెట్టుకున్న కాంగ్రెస్ లీడర్లు, BRS జంపింగ్ జపాంగ్స్ డీలా పడ్డారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. కేబినెట్ లో ఇంకా 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే… ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలకు కేబినెట్ లో చోటు దక్కలేదు. ఇంకా కొన్ని సామాజిక వర్గాలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది. అలాగే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, వినోద్, ప్రేమ్ సాగర్, సుదర్శన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళుకాకుండా… BRS నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన దానం నాగేందర్ కూడా మంత్రి పదవిపై కన్నేశారు. దాంతో నాలుగు పదవులను ఇప్పుడు భర్తీ చేసి… మరో రెండింటిని BRS నుంచి వచ్చే ఎమ్మెల్యేలకు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. లిస్టు తీసుకునే ఢిల్లీకి వెళ్ళారు. వాళ్ళల్లో ఒకరిద్దరికి ఖచ్చితంగా పదవి ఇవ్వాలని కూడా రేవంత్ పట్టుబట్టారు. కానీ భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి సీనియర్లు కూడా మంత్రి పదవుల ఆశవాహుల లిస్టును కాంగ్రెస్ హైకమాండ్ ముందు ఉంచినట్టు తెలుస్తోంది. తమ సిఫార్సులు కూడా లెక్కలోకి తీసుకోవాలని వాళ్ళు కోరారట. ఏ లిస్ట్ కన్ఫమ్ చేసినా… మళ్ళీ వర్గపోరు కంటిన్యూ అవుతుందని కాంగ్రెస్ పెద్దలు భావించారు. దాంతో మీరంతా ఏకాభిప్రాయానికి వచ్చి లిస్ట్ ఇస్తే… ఫైనల్ చేస్తామని తేల్చి చెప్పారట. BRS ఎమ్మెల్యేలను చేర్చుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే… ఇప్పటి దాకా పార్టీని నమ్ముకొని ఉన్న మా గతి ఏమవుతుందని కొందరు లీడర్లు ప్రశ్నించినట్టు సమాచారం. ఉన్నవి ఆరు మంత్రి పదవులు… ఎదురు చూసేవాళ్ళు అంతకంటే నాలుగైదు రెట్లు ఉన్నారు… అవసరమా… ఈ లొల్లి.. అని హైకమాండ్ భావిస్తోంది. అంతేకాదు… BRS ఎమ్మెల్యేలను చేర్చుకునేటప్పుడు వాళ్ళకి మినిస్ట్రీలు ఇస్తానని హామీ ఇచ్చి… రేవంత్ అడ్డంగా ఇరుక్కుపోయినట్టు తెలుస్తోంది. దానం నాగేందర్ ని సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయిస్తే ఓడిపోయారు. ఇప్పుడాయనకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ లో తీవ్ర వ్యతిరేకత వచ్చే ఛాన్సుంది. మొత్తానికి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలంతా ఏకమవడం వల్లే… కేబినెట్ విస్తరణకు బ్రేకులు పడినట్టు తెలుస్తోంది.