TS OR TG: ఇకపై TS కాదు.. TG.. వాహనాల నెంబర్ ప్లేట్లు మళ్లీ మార్చుకోవాలా..?
ఇకపై తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలపై TS బదులు.. TG అని కనిపించనుంది. వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లతోపాటు.. ఇప్పటివరకు ఉన్న TSPSC, TSRTC, TSPLRB వంటి పేర్లలో ఇకపై TS బదులు TG అని వాడే అవకాశం ఉంది.
TS OR TG: వాహనాల రిజిస్ట్రేషన్ సందర్భంగా వాడే కోడ్ TSను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. దీని బదులు TGని వాడబోతుంది. ఈ నిర్ణయానికి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలపై TS బదులు.. TG అని కనిపించనుంది. వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లతోపాటు.. ఇప్పటివరకు ఉన్న TSPSC, TSRTC, TSPLRB వంటి పేర్లలో ఇకపై TS బదులు TG అని వాడే అవకాశం ఉంది.
MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులు.. సుప్రీంకోర్టులో విచారణ 16కు వాయిదా..?
దీనిపై త్వరలోనే పూర్తిస్థాయి ప్రకటన వెలువడుతుంది. అయితే, ఈ విషయంలో తెలంగాణ వాహనదారుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఇప్పటికే TS పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలను తిరిగి TGతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా..? నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలా..? మళ్లీ డబ్బులు చెల్లించాలా..? వంటి అనుమానాలు తలెత్తాయి. ప్రస్తుతం అధికారవర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. తెలంగాణలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాహనాల నెంబర్లను మార్చుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకునే వాటికే TS బదులు TG అని ఉంటుంది. గతంలో ఉమ్మడి ఏపీలో రిజిష్టర్ చేయించుకున్న వాహనాల నెంబర్లను కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదని అప్పటి ప్రభుత్వం తెలిపింది. దీంతో ఏపీ పేరుతో రిజిష్టర్ అయిన తెలంగాణ వాహనాల నెంబర్లు అలాగే ఉన్నాయి.
2014 జూన్ 2 తర్వాత కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు మాత్రమే TS పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. తెలంగాణలో ఇంకా ఏపీ రిజిస్ట్రేషన్ కోడ్‌తోనే లక్షలాది వాహనాలున్నాయి. అందువల్ల ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత కూడా పాత వాహనాదారులు తమ కోడ్ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం జీవో వెలువడ్డ తర్వాత రిజిష్టర్ చేయించుకునే వాహనాలకు మాత్రమే TG కోడ్ వర్తిస్తుంది. కాబట్టి, వాహనదారులు ఎలాంటి గందరగోళానికి గురికాకూడదని అధికారులు అంటున్నారు.