REVANTH REDDY: గ్రూప్‌ 1, 2.. ఎక్కడ రేవంత్ సార్‌.. ఆడుకుంటున్న నిరుద్యోగులు..

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేస్తాం. ముందుగా ఫిబ్రవరి 1న గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం అంటూ.. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ ఇది. ఆ పార్టీ మ్యానిఫెస్టోలో, ప్రకటనల్లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 2, 2024 | 03:34 PMLast Updated on: Feb 02, 2024 | 3:34 PM

Telangana Youth Asking Cm Revanth Reddy About Group 1 Posts

REVANTH REDDY: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి నెలరోజులు దాటింది. సీఎంగా రేవంత్ తన మార్క్‌ పాలనతో దూసుకుపోతున్నారు. ఇక అటు లోక్‌సభ ఎన్నికలు కూడా త్వరలో జరగనుండడంతో.. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయ్. ఆరుగ్యారంటీలు అంటూ ఇచ్చిన హామీల సంగతి ఏంటంటూ.. బీఆర్ఎస్‌ నేతలు ఓ రేంజ్‌లో నిలదీస్తున్నారు. ఈ యుద్ధం ఇలా ఉంటే.. కాంగ్రెస్‌ను ఇప్పుడు నిరుద్యోగులు కూడా టార్గెట్‌ చేస్తున్నారు.

Poonam Pandey: చనిపోవడానికి గంటల ముందు పార్టీ.. కన్నీళ్లు పెట్టిస్తోన్న పూనమ్‌ చివరి పోస్ట్‌..

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేస్తాం. ముందుగా ఫిబ్రవరి 1న గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం అంటూ.. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ ఇది. ఆ పార్టీ మ్యానిఫెస్టోలో, ప్రకటనల్లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. ఐతే ఫిబ్రవరి 1 వచ్చింది.. వెళ్లింది.. లక్షల మంది నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ మాత్రం రాలేదు. హామీ ఇచ్చినవాళ్లకు, దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసినవాళ్లకు పదవులు వచ్చాయ్. మరి నోటిఫికేషన్ ఎప్పుడు సార్ అంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు జనాలు. మీ ఆనందంలో పడి మమ్మల్ని మర్చిపోయారా అంటూ.. సోషల్‌ మీడియా సాక్షిగా నిరుద్యోగులు మండిపడుతున్నారు. తమకు ఓట్లేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల్లో నిరుద్యోగులకు హామీ ఇచ్చింది.

అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి ఫిబ్రవరి 1నే గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ ఇస్తామని ప్రచారం చేసింది. ఐతే కాంగ్రెస్ సర్కార్ విషయంలో ఏ చిన్న తప్పు దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న విపక్ష బీఆర్ఎస్‌.. ఇప్పుడీ ఉద్యోగుల అంశాన్ని హైలైట్ చేసే అవకాశాలు ఉన్నాయ్. తప్పుడు హామీలు ఇచ్చారంటూ.. పదేపదే ఆరోపిస్తున్న కారు పార్టీ నేతలు.. గ్రూప్‌ 1, 2 నియామకాల విషయంలో రేవంత్‌ సర్కార్‌ను మరింత టార్గెట్ చేసే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయ్. జాబ్‌ క్యాలెండర్ అంటూ చెప్పి.. నోటిఫికేషనే ఇవ్వలేకపోయారు.. ఇక 2లక్షల ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారంటూ కామెంట్లు చేస్తున్నారు కొందరు నిరుద్యోగులు.