Srikantachari’s mother Shankaramma : శ్రీకాంతాచారి తల్లికి కీలక పదవి..!
మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది అంటే.. శ్రీకాంతాచాలి బలిదానమే కారణం. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆయన కుటుంబానికి సరైన న్యాయం దక్కలేదు అని పదేళ్లుగా వినిపిస్తూనే ఉంది. శ్రీకాంతాచారి తల్లికి ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు కాంగ్రెస్ నిలదీసింది. ఐతే ఇప్పుడు తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. శ్రీకాంతాచారి తల్లికి కీలక పదవి కట్టబెట్టబోతుందా అనే చర్చ జరుగుతోంది.

The Congress government is going to give a key post to Srikantachari's mother Shankaramma, who was a martyr during the Telangana movement.
మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది అంటే.. శ్రీకాంతాచాలి బలిదానమే కారణం. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆయన కుటుంబానికి సరైన న్యాయం దక్కలేదు అని పదేళ్లుగా వినిపిస్తూనే ఉంది. శ్రీకాంతాచారి తల్లికి ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు కాంగ్రెస్ నిలదీసింది. ఐతే ఇప్పుడు తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. శ్రీకాంతాచారి తల్లికి కీలక పదవి కట్టబెట్టబోతుందా అనే చర్చ జరుగుతోంది.
శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ.. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతున్న తరుణంలో.. ఈ సమావేశం జరగడం ఆసక్తికరంగా మారింది. ఆమెకు ఓ కీలక పదవి దక్కనున్నట్టు తెలుస్తోంది. పదవికి సంబంధించి.. రేవంత్ ప్రభుత్వం సూత్రప్రాయంగా ఓ నిర్ణయం కూడా తీసేసుకున్నట్లు సమాచారం. నామినేటెడ్ పోస్టు లేదా.. చట్టసభలకు ఎమ్మెల్సీగానూ ఆమెను పంపించే అవకాశాలు ఉన్నాయని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమకారులు, అమరుల కుటుంబాలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని.. రేవంత్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈ లెక్కన.. ఆమెకు పదవి దాదాపు కన్ఫార్మ్ అనే చర్చ జరుగుతోంది. రేవంత్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 54కార్పొరేషన్ల చైర్మన్లను రద్దు చేశారు.
అవి ఎలాగూ ఖాళీగానే ఉన్నాయ్. దీనికితోడు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రాబోతున్నాయ్. దీంతో శంకరమ్మకు ఏదో ఒక పదవి కట్టబెట్టడం ఖాయం అనే చర్చ జరుగుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్.. శంకరమ్మకు పదవి ఇవ్వడం ద్వారా ఉద్యమకారుల మద్దతు అందుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పట్టించుకోని నేతలు, కుటుంబాలపై.. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పెద్దలు.. స్వయంగా స్పందిస్తున్నారు. డీఎస్పీ నళిని విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు శంకరమ్మకు కూడా ప్రాధాన్యత కల్పించబోతున్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను పూర్తిగా తమ వైపు తిప్పుకోవడం ద్వారా.. బీఆర్ఎస్ తీరు మరింత ఎండగట్టాలన్నది కాంగ్రెస్, రేవంత్ ప్లాన్‌గా కనిపిస్తోంది.