MLC Kavitha CBI Custody : నేటితో ముగిసిన కవిత సీబీఐ కస్టడీ.. బెయిల్ వస్తుంది అంటూ ధైర్యం చెప్పిన కేటీఆర్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) ను ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case)లో సీబీఐ కస్టడీ (CBI Custody) ముగిసింది. ఇవాళ ఉదయం 10 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) ను ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case)లో సీబీఐ కస్టడీ (CBI Custody) ముగిసింది. ఇవాళ ఉదయం 10 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆమె సీబీఐ కస్టడీ పూర్తి కావడంతో తిరిగి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు సీబీఐ అధికారులు తీసుకెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసినప్పటికీ, ఆ తర్వాత సీబీఐ కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 3 రోజుల కస్టడీలో కవిత వెల్లడించిన పలు అంశాలను సీబీఐ కోర్టుకు చెప్పే అవకాశం ఉంది.. మరో 5 రోజుల కస్టడీ కోరాలని CBI నిర్ణయం తీసుకోనున్నట్లు.. న్యాయమూర్తిని కోరే అవకాశం ఉంది.
నిన్న ఉదయం ఢిల్లీ వెళ్లిన మాజీ మంత్రి.. కవిత సోదరుడు కేటీఆర్.. ఆదివారం సాయం త్రం 5:45 గంటలకు సీబీఐ కార్యాలయంలోకి వెళ్లారు. తిరిగి 7:40 గంటలకు కేటీఆర్, కవిత భర్త అనిల్ కుమార్ బయటకు వచ్చారు. MLC కవితతో KTR 35 నిమిషాల మాట్లడినట్లు సమాచారం.. సీబీఐ కస్టడీలో వసతులు, విచారణ తీరు, తిహాడ్ జైలులో పరిస్థితి, సీబీఐ అరెస్టు సమాచారం ఎప్పుడు తెలిసింది? ఏయే అంశాలపై విచారణ నడుస్తున్నది, కేసు విచారణలో ఈడీ, సీబీఐ వ్యవహరిస్తున్న తీరు, బెయిల్ పిటిషన్ తదితర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం.. కాగా కేటీఆర్ కవితకు బెయిల్ వస్తుందని ధైర్యం చెప్పినట్లు సమాచారం..
SSM