Rythu Bandhu : రైతు రుణమాఫీకి ముహూర్తం ఫిక్స్.. రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్..
తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల హామీల అమలుపై కసరత్తు మొదలుపెట్టింది. మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగబోతుండగా.. ఆరు గ్యారెంటీల్లో ఇచ్చిన హామీలను జనాల దగ్గరకు చేరవేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆరు గ్యారెంటీల్లో (Six Guarantees) రెండు గ్యారెంటీలు అయిన.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ కార్డు పరిమితి పెంపు అమలు చేసింది.

Time fixed for farmer loan waiver.. Revanth Sarkar good news..
తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల హామీల అమలుపై కసరత్తు మొదలుపెట్టింది. మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగబోతుండగా.. ఆరు గ్యారెంటీల్లో ఇచ్చిన హామీలను జనాల దగ్గరకు చేరవేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆరు గ్యారెంటీల్లో (Six Guarantees) రెండు గ్యారెంటీలు అయిన.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ కార్డు పరిమితి పెంపు అమలు చేసింది. దీంతో ఇప్పుడు మిగిలిన హామీలను కూడా అమలు చేసే విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది రేవంత్ సర్కార్. గృహజ్యోతి పథకం కింద ప్రతీ ఇంటికి 2వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని.. ఎవరు కరెంట్ బిల్లులు కట్టకండి అని.. మనదే అధికారం అంటూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు తెగ ప్రచారం చేశారు.
ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ (Telangana Government) అధికారంలోకి రావడంతో.. ఫ్రీ కరెంట్ అంశం తెరపైకి వచ్చింది. ఈ మధ్య సీఎం రేవంత్ కూడా కరెంట్ అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో 24 గంటల కరెంట్, ఇంటింటికి ఫ్రీ కరెంట్‌లాంటి పలు అంశాలపై చర్చించారు. త్వరలో కొత్త విద్యుత్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు.. దీనిపై అధికారులు సమీక్ష చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక అటు ఇప్పుడు రైతులకు రుణమాఫీ వ్యవహారంలో.. విపక్ష బీఆర్ఎస్ నుంచి రేవంత్ సర్కార్‌కు ఒత్తిడి కనిపిస్తోంది. దీంతో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసే ప్రక్రియను రేవంత్ సర్కార్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు వైఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఒకే దఫాలో రైతులకు రుణమాఫీ చేసింది. వైఎస్ అడుగులనే ఇప్పుడు సీఎం రేవంత్ ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రైతుల (Telangana Farmers) రుణాలను ఒకే దఫాలో మాఫీ చేసేందుకు రేవంత్ (CM Revanth Reddy) సర్కార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. లేదంటే రెండు దఫాల్లో పూర్తి చేయనుంది. లోక్‌సభ ఎన్నికలలోపే దీన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలోని రైతులు బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకున్న క్రాప్ లోన్ల కారణంగా.. వారిపై వడ్డీ భారం పడకుండా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం కోసం రేవంత్ సర్కార్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా చెల్లించేలా ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం.